శిథిలావస్థలో ఉన్న పాత నీళ్ల ట్యాంకును తొలగించండి

by Ratna Kumari |   (  Updated:2025-10-18 14:25:39  IST  )

దిశ, కొత్తపల్లి : కొత్తపల్లి మండల కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీస్ కాలనీ వాసులు తమ కాలనీకి వెళ్లే రహదారికి మధ్యలో 15 సంవత్సరాలుగా ప్రమాదకరంగా, నిరుపయోగంగా

శిథిలావస్థలో ఉన్న పాత నీళ్ల ట్యాంకును తొలగించండి
X

దిశ, కొత్తపల్లి : కొత్తపల్లి మండల కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీస్ కాలనీ వాసులు తమ కాలనీకి వెళ్లే రహదారికి మధ్యలో 15 సంవత్సరాలుగా ప్రమాదకరంగా, నిరుపయోగంగా ఉన్న పాత నీళ్ల ట్యాంకును తొలగించాలని శనివారం ఎంపీడీవో కృష్ణారావు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. ముఖ్యంగా కాలనీలో పలువురికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయి. ప్రధాన రహదారి మధ్యలో ఉన్న ఈ పాత ట్యాంకు కారణంగా ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరైన వారు నిర్మాణ సామాగ్రిని తరలించే వాహనాలు లోపలికి వెళ్లలేని పరిస్థితి ఉందని.. దీంతో గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో మధుసూదన్ రెడ్డి, మద్దూరు భాస్కర్ రెడ్డి, భగవంతు, బాలు యాదవ్, అశోక్, తిమ్మారెడ్డి, కిరణ్ గౌడ్, చాకలి నరేష్ పాల్గొన్నారు.

Next Story