మృతదేహంతో బాధితుల నిరసన

by Ratna Kumari |   (  Updated:2025-10-18 15:35:13  IST  )

దిశ‌, రేవ‌ల్లి : మండల కేంద్రం రేవల్లికి చెందిన దాసరి శేఖర్ (33) అనుమానాస్పదంగా గ్రామ సమీపంలోని ఓ వ్యవసాయ పొలంలోని చెట్లపొదల్లో కుళ్ళినస్థితిలో ఉన్న

మృతదేహంతో బాధితుల నిరసన
X

దిశ‌, రేవ‌ల్లి : మండల కేంద్రం రేవల్లికి చెందిన దాసరి శేఖర్ (33) అనుమానాస్పదంగా మృతి చెందిన విష‌యం తెలిసిందే. అత‌ని మృతికి కార‌ణాల‌ను నిగ్గు తేల్చేందుకు స్థానిక పోలీసులు ఫోరెన్సిక్ ప‌రీక్ష‌ల నిమిత్తం మృతదేహాన్ని శుక్ర‌వారం వ‌న‌ప‌ర్తికి త‌ర‌లించారు. ఇదిలా ఉంటే.. శ‌నివారం మ‌ధ్యాహ్నం శ‌వ ప‌రీక్ష‌ల అనంత‌రం మృత‌దేహాన్ని కుటుంబ స‌భ్యుల‌కు అందివ్వ‌గా.. మృత‌దేహాన్ని తీసుకొని యాద‌వ‌సంఘం భ‌వ‌నం ముందుంచి నిర‌స‌న‌కు దిగారు. ఈనెల 5న మృతునికి సంబంధం లేని ఓ గొర్రెల దొంగ‌త‌నాన్ని గ్రామ యాద‌వ‌సంఘం క‌మిటీ స‌భ్యులు అంట‌గ‌ట్టారు. పోలీస్ స్టేష‌న్ లో కూత వేటు దూరంలో ఉన్న ఆ సంఘం భ‌వ‌నంలో దొంగ‌త‌నాన్ని ఒప్పుకోవాల‌ని మృతుడిని తాళ్ల‌తో బంధించి కొట్టి బ‌ల‌వంతంగా ఒప్పించార‌ని ఆరోజు నుంచి దీనిని అవ‌మానంగా భావించి మృతుడు ఇంట్లో నుంచి వెళ్లిపోయినా.. విధించిన జ‌రిమానాను మృతుని భార్య మ‌హేశ్వ‌రి నుంచి రూ.15వేలు జ‌రిమానాను బ‌ల‌వంతంగా వ‌సూలు చేశారు. అయితే మృతికి కార‌కులైన స‌భ్యుల‌ను క‌ఠినంగా శిక్షించి మృతుని కుటుంబాన్ని ఆర్తికంగా ఆదుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి ద‌ర్యాప్తును వేగ‌వంతం చేసి నిందితుల‌ను గుర్తించి శిక్షిస్తామ‌ని ఎస్సై ర‌జిత చెప్ప‌డంతో మృతుల కుటుంబ స‌భ్యులు శాంతించారు.

Next Story