- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొల్లాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్‌గా రెడ్డి జ్యోతి
కొల్లాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్‌గా రెడ్డి జ్యోతి సత్యం, వైస్ చైర్మన్ గా షేక్ రహీం పాషా ఎన్నికయ్యారు.

దిశ, కొల్లాపూర్: కొల్లాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్‌గా కాంగ్రెస్ పార్టీ 6 వార్డ్ కౌన్సిలర్ రెడ్డి జ్యోతి సత్యంను,9 వార్డ్ కౌన్సిలర్ వైస్ చైర్మన్ గా షేక్ రహీం పాషా ఎన్నికయ్యారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ముందుగా మున్సిపల్ పాలకవర్గం సభ్యులతో ఆర్డీవో బన్సీలాల్ ప్రమాణస్వీకారం చేయించారు. అంతకు ముందు కాంగ్రెస్‌కు చెందిన 16 వార్డుల సభ్యులు ప్రమాణం చేశారు. అయితే చైర్ పర్సన్ రేసులో 6వ వార్డు కౌన్సిలర్ రెడ్డి జ్యోతిని 8వ వార్డు కౌన్సిలర్ అన్వర్ ప్రతిపాదించగా,16వ వార్డు కౌన్సిలర్ శేఖర్ బలరిచారు. అయితే చైర్ పర్సన్ పీఠంకు 18వ వార్డు కౌన్సిలర్ శ్రీదేవి గౌతంగౌడ్ పోటీకి దిగింది. శ్రీదేవి గౌతం గౌడ్‌కు 13వ వార్డు కౌన్సిలర్ వంగా అనూష రాజ శేఖర్ గౌడ్ ప్రతిపాదించగా, కౌన్సిలర్స్ ఎవ్వరూ బలపర్చనందున సమావేశం నుంచి శ్రీదేవి గౌతంగౌడ్ నిష్క్రమించారు. దీంతో చైర్ పర్సన్‌గా రెడ్డి జ్యోతి ఎన్నికైనట్లు లాంఛనంగా ఎన్నికల అధికారి బన్సీలాల్ ప్రకటించారు.
వైస్ చైర్మన్‌గా పోటీలోకి దిగిన్ రహీం పాషాకు 14వ వార్డు కౌన్సిలర్ సిబ్బది నరసింహ రావును ప్రతిపాదించగా, 5వ వార్డు కౌన్సిలర్ రమ్య కుమారి బలపరిచడంతో రహీం పాషా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి బన్సీలాల్ ప్రకటించారు. అనంతరం చైర్ పర్సన్, వైస్ చైర్మన్ తో అధికారి బన్సీలాల్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు వారికి పుష్ప గుచ్చం అందజేసి శాలువా కప్పి అభినందించారు.






