- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్రికెట్ తో పోటీగా కబడ్డీకి గుర్తింపు : మంత్రి వాకిటి శ్రీహరి
భారతదేశంలో ఇప్పుడు కబడ్డీకి క్రికెట్ కి ఉన్నత ఆదరణ ఉందని.. క్రికెట్ తరహాలో ఐపీఎల్ మాదిరిగా కబడ్డీలో ఊడా ప్రో కబడ్డీ లీగ్ పోటీలు వచ్చాయని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.

దిశ, మక్తల్ : భారతదేశంలో ఇప్పుడు కబడ్డీకి క్రికెట్ కి ఉన్నత ఆదరణ ఉందని.. క్రికెట్ తరహాలో ఐపీఎల్ మాదిరిగా కబడ్డీలో ఊడా ప్రో కబడ్డీ లీగ్ పోటీలు వచ్చాయని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడుళ్ల బయ్యారంలో బుధవారం కంది చారిటబుల్ ట్రస్ట్, మౌరి టెక్ ఆర్గనైషన్ ల ఆధ్వర్యంలో నిర్వహించే 69వ ఎస్జీఎఫ్ అండర్ 17 బాలుర జాతీయ కబడ్డీ ఛాంపియన్ షిప్ ను క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, మంత్రి సీతక్కతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ఈ కబడ్డీ పోటీలను చూస్తే.. సంక్రాంతి పండుగ ముందే వచ్చిందని తెలిపారు. బయ్యారంలో జరిగే కబడ్డీని దేశం మొత్తం చూసేలా చేయాలన్నారు. గత ఏడాది నవంబర్ లో ఇదే వేదిక పై రాష్ట్ర స్థాయి బాల, బాలిక కబడ్డీ పోటీలు విజయవంతంగా నిర్వహించారని మంత్రి గుర్తు చేశారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన 33 జట్లు బయ్యారంలో కబడ్డీలో పాల్గొనడం సంతోషకరమని తెలిపారు.
మట్టి వాసనతో
మట్టి వాసనతో కూడిన అద్బతమైన క్రీడా కబడ్డీ అని.. కబడ్డీ కేవలం ఆట మాత్రమే కాదు.. మన దేశ సంస్కృతిలో భాగం అని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పుట్టిన ఈ క్రీడకు నేడు పట్టణ ప్రాంతాల్లో, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందన్నారు. కబడ్డీ ఆట ను చూసేవారికి కూడా ఉత్సాహం వస్తుందని తెలిపారు. కబడ్డీ ఆడడానికి కేవలం శారీరక బలం మాత్రమే కాకుండా ప్రత్యర్థి నుంచి వేగంగా ఎలా తప్పించుకోవాలో కూడా అవసరం అని అభిప్రాయపడ్డారు. కబడ్డీ ఆటకు ఏకాగ్రత, క్రమశిక్షణ చాలా అవసరమన్నారు. కార్యక్రమంలో మంత్రి వాకిటిశ్రీహరి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, కలెక్టర్ జితేష్ శ్రీ పటేల్, ఎస్పీ రోహిత్ రాజ్, పి ఓరాహుల్, నిర్వహకులు విశ్వ భరత్ రెడ్డి లు పాల్గొన్నారు.






