- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ కథనానికి స్పందన.. పదో తరగతి పరీక్షలు రాసేందుకు వచ్చిన విద్యార్థి
మండల కేంద్రంలోని పదో తరగతి చదివే విద్యార్థి తెలుగు పరీక్ష రాయకుండా హైదరాబాద్ కి వెళ్లిన విషయం తెలిసిందే. పదోతరగతి పరీక్షలు రాసేందుకు ఆ విద్యార్థి వచ్చాడు.

దిశ, గోపాల్ పేట : మండల కేంద్రంలోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దినపత్రికలో పదో తరగతి పరీక్షకు హాజరు కాకుండా హైదరాబాద్ కి వెళ్లిన విషయం తెలుసుకొని భూతా భరత్ సోమవారం తన పదో తరగతి హాల్ టికెట్ తీసుకున్నాడు. అతను తెలుగు పరీక్షను మిస్ అయ్యాడు. కానీ మిగిలిన పరీక్షలను రాయనున్నాడు. పదో తరగతి సర్టిఫికేట్ ప్రాముఖ్యతను వివరించి ఎస్ఐ జగన్మోహన్, ఉపాధ్యాయులు ధర్మరాజు, ప్రధానోపాధ్యాయులు సురేందర్ రెడ్డి కౌన్సెలింగ్ ఇవ్వడంతో, అతని తండ్రి భూతా రాములు (ఏదుట్ల గ్రామం) హైదరాబాద్ నుంచి అతన్ని తీసుకుని వచ్చారు. అక్కడ అతను తన బంధువుల వద్ద ఉండేవాడు. ఈ విషయం దిశ పత్రికల్లో వార్తగా రావడంతో, అతని బంధువులు, శ్రేయోభిలాషులు అతన్ని పరీక్షలు రాయడానికి ప్రోత్సహించారు.ఈ వార్తను ప్రచురించిన విలేకరులకు ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. ఎందుకంటే వారి వల్ల బాలుడు పదో తరగతి పరీక్షలు రాయడానికి ప్రేరణ పొందాడు. గ్రామస్తులు, తోటి విద్యార్థులు దిశ దినపత్రికకు అభినందనలు తెలిపారు.






