- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశిష్ట వ్యక్తులను స్మరించుకునే విశేషవ్యక్తి రవికుమార్ : న్యాయవాది మనోహర్ రెడ్డి
విశిష్ట వ్యక్తులను స్మరించుకుంటూ వారి మార్గాలనుసరించే విశేష వ్యక్తి కే.ఎస్. రవికుమార్ అని ప్రముఖ న్యాయవాది వి. మనోహర్ రెడ్డి కొనియాడారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : విశిష్ట వ్యక్తులను స్మరించుకుంటూ వారి మార్గాలనుసరించే విశేష వ్యక్తి కే.ఎస్. రవికుమార్ అని ప్రముఖ న్యాయవాది వి. మనోహర్ రెడ్డి కొనియాడారు. ఈనెల 16 న ఉత్తమ పార్లమెంటేరియన్ స్వర్గీయ ఎస్.జైపాల్ రెడ్డి జయంతీ సందర్భంగా అవార్డుల అందజేత కార్యక్రమాన్ని పురస్కరించుకుని స్థానిక రెడ్ క్రాస్ సొసైటీ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గొప్ప వ్యక్తుల పట్ల గౌరవాన్ని, వారి అసాధారణ ప్రతిభ ను స్మరించుకుంటూ, వారి పేర స్మారక స్పూర్తి అవార్డులను అందజేయడం రవికుమార్ గొప్పతనమని ప్రశంసించారు. ఇందులో భాగంగా ఈనెల 16 న జెపిఎన్సీఈ కళాశాలలో నిర్వహించే స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి జయంతి ని పురస్కరించుకుని, జైపాల్ రెడ్డి స్మారక స్పూర్తి అవార్డులను, విశిష్ట వ్యక్తులు పోతుల రాంరెడ్డి, గద్వాల చంద్రశేఖర్ లకు సన్మాన పత్రంతో పాటు, ఒక్కొక్కరికి 25 వేల రూపాయల నగదును అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర సంగీత నాటక అకాడమీ మాజీ చైర్మెన్ బాద్మీ శివకుమార్ మాట్లాడుతూ, ఒక సాధారణ వ్యక్తిగా మొదలుపెట్టిన రవికుమార్ ప్రస్థానం పేరెన్నికగన్న ఇంజనీరింగ్ కళాశాల చైర్మెన్ స్థాయికి ఎదగడం హర్షించదగ్గ విషయమన్నారు. చైర్మెన్ రవికుమార్ మాట్లాడుతూ, జైపాల్ రెడ్డి స్మారక స్పూర్తి అవార్డులకు ఎంపిక చేసే విధానాన్ని మనోహర్ రెడ్డి, బాద్మీ శివకుమార్ ల సలహాల సూచనలతో ఎంపిక చేస్తున్నామన్నారు. 16 న జరిగే అవార్డుల కార్యక్రమానికి టెలివిజన్ నటుడు, కమెడియన్ సుడిగాలి సుధాకర్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని అన్నారు. సోమవారం కళాశాల ఆవరణలో సంక్రాంతి పండుగ సంబరాలు నిర్వహించనున్నామని తెలిపారు. ఈ సమావేశంలో వెంకటరామారావు, గిరిధర్ రెడ్డి లు పాల్గొన్నారు.






