మైన‌ర్ బాలిక పై అత్యాచారం.. నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్ష

by Ratna Kumari |

మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడి పై నేరం రుజువు కావడంతో వనపర్తి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.ఆర్. సునీత నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.30,000 జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చారని ఎస్పీ సునిత రెడ్డి తెలిపారు.

మైన‌ర్ బాలిక పై అత్యాచారం.. నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్ష
X

దిశ, గోపాల్ పేట : మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడి పై నేరం రుజువు కావడంతో వనపర్తి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.ఆర్. సునీత నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.30,000 జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చారని ఎస్పీ సునిత రెడ్డి తెలిపారు. ఎస్పీ సునీత రెడ్డి తెలిపిన వివరాల ప్ర‌కారం.. వనపర్తి జిల్లా గోపాల్‌పేట్ మండలం లక్ష్మితండాకు చెందిన ఒక మైనర్ బాలిక (9వ తరగతి) ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న సమయంలో అదే తండాకు చెందిన నిందితుడు ఆమెను బలవంతంగా గ్రామం బయటకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వెతుకుతుండ‌గా.. గుట్ట దగ్గర ఏడుస్తూ ఉన్న బాలికను కనుగొన్నారు. జరిగిన ఘటనను బాలిక తన తల్లికి వివరించింది. దీంతో త‌ల్లి వెంటనే 27-02-2020న గోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న‌ గోపాల్‌పేట్ ఎస్సై రామన్ గౌడ్, అప్పటి సీఐ సూర్య నాయక్ ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు సాంకేతిక ఆధారాలు, బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. ప్రస్తుత సీఐ రత్నం, ఎస్సై జగన్, కోర్టు లైజనింగ్ అధికారి, సిబ్బంది సమన్వయంతో సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టి కేసును బలపరిచారు.ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాసచారి సమర్థవంతంగా వాదనలు వినిపించడంతో, నేరం నిరూపితమైందని కోర్టు నిర్ధారించి కఠిన శిక్ష విధించింది.ఈ సందర్బంగా ఎస్పీ సునీత రెడ్డి మాట్లాడుతూ సమాజాన్ని కుదిపేసే నేరాలకు పాల్పడిన వారిపై కోర్టులు కఠిన శిక్షలు విధించడం వల్ల నేరస్తుల్లో భయం పెరుగుతుంది. ఇలాంటి తీర్పులుసమాజానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి. నేరం చేయాలనే ఆలోచనకే భయపడేలా న్యాయ వ్యవస్థ వ్యవహరిస్తోంది. బాధితులకు న్యాయం అందించడంలో పోలీసులు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారు. ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా.. ఏ అన్యాయం జరిగినా వెంటనే పోలీసులను సంప్రదించాలని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడటానికి కృషి చేసిన పోలీసు అధికారులను పబ్లిక్ ప్రాసిక్యూటర్, కోర్టు సిబ్బంది అందరిని ఎస్పీ అభినందించారు.

Next Story