ఒంటరి మహిళ పై హత్యాచార యత్నం

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-03-24 14:20:08  IST  )

ఒంట‌రి మ‌హిళ పై ఓ వ్య‌క్తి అత్యాచార‌, హ‌త్యాచార య‌త్నానికి పాల్ప‌డిన ఘ‌ట‌న న‌వాబుపేట మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది.

ఒంటరి మహిళ పై హత్యాచార యత్నం
X

దిశ, నవాబుపేట : ఒంట‌రి మ‌హిళ పై ఓ వ్య‌క్తి అత్యాచార‌, హ‌త్యాచార య‌త్నానికి పాల్ప‌డిన ఘ‌ట‌న న‌వాబుపేట మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్సై విక్ర‌మ్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మండ‌ల ప‌రిధిలోని కేశ‌వ‌రావుప‌ల్లి గ్రామానికి చెందిన స‌లీమా(42) ఒంట‌రి మ‌హిళ పై అదే గ్రామానికి చెందిన ఆమె దాయాది ష‌బ్బీర్ అలీ సోమ‌వారం రాత్రి అత్యాచార య‌త్నానికి పాల్ప‌డ్డాడు. ఆమె ప్ర‌తిఘ‌టించ‌డంతో ఆమె గొంతు నులిమి హ‌త్య చేసే ప్ర‌య‌త్నం చేసిన‌ట్టు స‌మాచారం. స‌లీమా భ‌ర్త మ‌ర‌ణించ‌డంతో ఒంట‌రిగా జీవిస్తోంది. దీంతో ఆమె పై క‌న్నేసిన ష‌బ్బీర్ అలీ సోమ‌వారం రాత్రి అత‌ని ఇంటి ముందు ఆమె కూర్చొని ఉండ‌గా ర‌మ్మ‌ని పిలిచాడు.

ఆమె ఏమి ప‌ని ఉందోన‌ని వెళ్ల‌గా.. ఆమె పై బ‌ల‌వంతంగా అత్యాచార య‌త్నానికి పాల్ప‌డ్డాడు. అతని భారీ నుంచి త‌ప్పించుకునేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. ఆమె చేతికి ఉన్న‌టువంటి గాజులు ప‌గిలి చేతికి గాయాల‌య్యాయి. అయిన‌ప్ప‌టికీ ష‌బ్బీర్ అలీ ఆమెను వ‌ద‌ల‌క‌పోవ‌డంతో గ‌ట్టిగా కేక‌లు వేసింది. ఆమె అరుపులు విన్న గ్రామానికి చెందిన ఓ వ్య‌క్తి ఆమెను కాపాడేందుకు య‌త్నించ‌గా.. అత‌ని పై కూడా ష‌బ్బీర్ అలీ దాడి చేశాడు. దీంతో స‌లీమా పెద్ద‌గా అర‌వ‌డంతో గొడ‌వ జ‌రుగుతుంద‌ని గ్రామ‌స్తులు అంద‌రూ గుంపులుగా వ‌చ్చి బాధితురాలును కాపాడారు. బాధితురాలు స‌లీమా ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌డుతున్న‌ట్టు ఎస్సై విక్ర‌మ్ తెలిపారు.

Next Story