సర్పంచ్ ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రంజిత్ కుమార్ గౌడ్

by Ratna Kumari |

మండల పరిధిలోని య‌న్మాన్ గండ్ల గ్రామ సర్పంచ్ మల్గారి రంజిత్ కుమార్ గౌడ్ సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

సర్పంచ్ ల  సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రంజిత్ కుమార్ గౌడ్
X

దిశ, నవాబుపేట : మండల పరిధిలోని య‌న్మాన్ గండ్ల గ్రామ సర్పంచ్ మల్గారి రంజిత్ కుమార్ గౌడ్ సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన రాష్ట్ర సర్పంచుల సంఘం సమావేశంలో రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేయగా.. యువతలో ప్రతిభ కనబరుస్తూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న సర్పంచులకు కీలక బాధ్యతలు అప్పగించారు. యన్మన్‌గండ్ల సర్పంచ్‌గా మల్గారి రంజిత్ కుమార్ గౌడ్ గ్రామ ప్రజల సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తూ మంచి గుర్తింపు పొందారు. ఆయన సేవలను గుర్తించిన రాష్ట్ర సర్పంచుల సంఘం ఉపాధ్యక్ష పదవిని అప్పగించింది. ఈ సందర్భంగా మండలంలోని ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధికారులు, సర్పంచులు గ్రామ ప్రజలు రంజిత్ కుమార్ గౌడ్‌కు అభినందనలు తెలియజేస్తూ, ఆయన మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయిలో సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం ఆయన సమర్థవంతంగా పని చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story