- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రంగాపూర్ జాతర.. టెంకాయల విక్రయాల్లో ఇష్టారాజ్యం..!
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని రంగాపూర్ జాతరలో దోపిడీని అరికట్టే బాధ్యత వహించాల్సిన అధికారులు కనిపించకపోవడంతో భక్తులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

దిశ, అచ్చంపేట రూరల్ : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని రంగాపూర్ జాతరలో దోపిడీని అరికట్టే బాధ్యత వహించాల్సిన అధికారులు కనిపించకపోవడంతో భక్తులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక టెండర్లు లేకున్నా, కొందరు గ్రామస్తులు సొంతంగా సవాల్ పాడుకుని తమకు నచ్చిన రేట్లకే టెంకాయలను విక్రయిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. జాతరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అధిక ధరలతో ఇబ్బందులు పడుతున్నారని, ప్రశ్నిస్తే సమాధానం చెప్పే వారు లేరని వాపోతున్నారు. టెంకాయల ధరలపై ఎలాంటి నియంత్రణ లేకపోవడం వల్ల సామాన్య భక్తులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయటి మార్కెట్లో కొబ్బరికాయ 30 నుంచి 40 రూపాయల వరకు ఉంటే జాతరలో మాత్రం 100 నుంచి 150 రూపాయలు పెట్టి అమ్ముతున్నారని భక్తులు వాపోతున్నారు. అందువల్ల కొబ్బరికాయలు తీసుకునేవారు లేక దుకాణ యజమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతర వంటి పవిత్ర కార్యక్రమంలో ఇలాంటి అక్రమాలు చోటుచేసుకోవడం బాధాకరమని భక్తులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, అక్రమ విక్రయాలపై చర్యలు తీసుకోవాలని, అధికారికంగా టెండర్లు నిర్వహించి ధరల నియంత్రణ చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే జాతరపై ఉన్న భక్తుల విశ్వాసం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు.






