- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజోలిలో ఉత్సాహంగా పొట్టేళ్ల పందెం..
by Taduka Kalyani |
రాజోలి మండల కేంద్రంలోని శ్రీ అడివేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం అంతరాష్ట్ర పొట్టేళ్ల పందెం పోటీలు హోరాహోరీగా జరిగాయి.

X
దిశ, రాజోలి: రాజోలి మండల కేంద్రంలోని శ్రీ అడివేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం అంతరాష్ట్ర పొట్టేళ్ల పందెం పోటీలు హోరాహోరీగా జరిగాయి. పలుగ్రామాల నుంచి పొట్టేళ్లు పందెంలో పాల్గొనేందుకు తీసుకొచ్చారు. ఈ పోటీలను తిలకించేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. పోటీలకు వచ్చిన పొట్టేళ్లను ఒకదానిపైకి మరొకటి ఉసిగొలిపి తలపడేలా చేస్తారు.
ఈ పోటీలో గెలుపొందిన పొట్టేళ్లకు బహుమతులు అందజేస్తారు. ఈ పోటీల్లో ప్రథమ బహుమతి చెరుకుచెర్ల వంశీకి చెందిన పొట్టేలు రూ.10 వేలు, ద్వితీయ బహుమతి జూలేకల్ భాషాకు చెందిన పొట్టేలు రూ.7వేలు, తృతీయ బహుమతి పూలతోట సాగర్ కు చెందిన పొట్టేలు రూ. 4వేలు ఆలయ కమిటీ నగదు బహుమతులను అందజేశారు.
Next Story






