- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పర్యాటక ప్రాంతంగా రామలింగేశ్వర ఆలయం
సోమశిల - అలంపూర్ టూరిజం మాస్టర్ ప్లాన్ లో భాగంగా పెంట్ల వెల్లి మండలం మంచాలకట్ట రామలింగేశ్వర ఆలయ ప్రాంతాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు కృషితో పర్యాటక రంగంగా తీర్చిదిద్దనున్నట్టు నాగర్ కర్నూల్ జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ వెల్లడించారు.

దిశ, పెంట్లవెల్లి : సోమశిల - అలంపూర్ టూరిజం మాస్టర్ ప్లాన్ లో భాగంగా పెంట్ల వెల్లి మండలం మంచాలకట్ట రామలింగేశ్వర ఆలయ ప్రాంతాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు కృషితో పర్యాటక రంగంగా తీర్చిదిద్దనున్నట్టు నాగర్ కర్నూల్ జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ వెల్లడించారు. ఆదివారం మంచాలకట్ట కృష్ణా పుష్కర ఘాట్ ను ఆయన సందర్శించారు. పెంట్లవెళ్లి మండలం మంచాలకట్ట గ్రామంలో ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని, కృష్ణా పుస్కార ఘాట్ ను గ్రామ సర్పంచ్ చంద్రమ్మ వెంకటేష్, ఉప సర్పంచ్ శివ తో కలిసి జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ పరిశీలించారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంచాలకట్ట గ్రామాన్ని పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేసే ప్రణాళిక లో భాగంగా మంచాలకట్ట పుస్కార ఘాట్ ను, రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని సోమశిల - అలంపూర్ మాస్టర్ ప్లాన్ లో చేర్చడం జరిగిందన్నారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమశిల- అలంపూర్ మాస్టర్ ప్లాన్ కు నిధులు కేటాయించి మంచాలకట్ట గ్రామ అభివృద్ధికి కృషి చేస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచాలకట్ట గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కురుమయ్య , బాలరాజు, గోవింద్, కురుమూర్తి, రాఫవేంద్ర, నిరంజన్ పాల్గొన్నారు.






