- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, పాన్ గల్ : మండల కేంద్రంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన పాన్ గల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీల్లో రాజు లెవెన్ జట్టు విన్నర్ గా నిలిచింది. శుక్రవారం నిర్వహించిన ఫైనల్ పోటీల్లో రాజు లెవెన్ జట్టు ఫ్రెండ్స్ లెవెన్ జట్టుల మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ పోరులో రాజు లెవెన్ జట్టు విజేతగా నిలిచింది. ఇక ఫ్రెండ్స్ లెవెన్ జట్టు రన్నరప్ గా నిలిచింది. విన్నర్ గా నిలిచిన జట్టుకు రూ. 10వేల నగదుతో పాటు షీల్డ్ ను బహుమతి దాత సత్తూరి నరేందర్ గౌడ్, రన్నర్ జట్టుకు రూ.5వేల నగదుతో పాటు షీల్డ్ ను బహుమతి దాత కొత్త బాలవర్ధన్ రెడ్డి అందజేశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లను లింగాల శివ కుమార్ యాదవ్, వడ్లకొండ వేణుగోపాల్ యాదవ్ లు అందజేశారు. కార్యక్రమంలో పీపీఎల్ నిర్వాహకులు శివ, చరణ్, ప్రవీణ్ కుమార్, తులసి పాల్గొన్నారు.






