చెరువును తలపిస్తున్న రాజోలి-వడ్డేపల్లి రోడ్డు

by Elthuri vijay kumar |

రాజోలి, వడ్డేపల్లి రెండు మండలాలను కలిపే ప్రధాన రహదారి ప్రస్తుతం దయనీయ పరిస్థితిలో ఉంది. ఈ రహదారి మీదుగా నిత్యం వేలాది సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.

చెరువును తలపిస్తున్న రాజోలి-వడ్డేపల్లి రోడ్డు
X

చెరువును తలపిస్తున్న రాజోలి-వడ్డేపల్లి రోడ్డు

గుంతలుపడి అధ్వానంగా మారిన రహదారి

తరుచూ ప్రమాదాలు

ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు, వాహనదారులు

దిశ, రాజోలి : రాజోలి, వడ్డేపల్లి రెండు మండలాలను కలిపే ప్రధాన రహదారి ప్రస్తుతం దయనీయ పరిస్థితిలో ఉంది. ఈ రహదారి మీదుగా నిత్యం వేలాది సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. బైకులు, ఆటోలు, లారీలు, బస్సులు ఇలా అన్ని రకాల వాహనాలు ప్రయాణిస్తున్నప్పటికీ రోడ్డు గుంతలు, అడ్డంకులు తొలగించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎన్నో ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు జరిగినా అధికారులలో ఎవరూ శ్రద్ధ చూపకపోవడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది. స్థానికులు చెబుతున్నట్లుగా రోడ్డు పరిస్థితి రోజురోజుకూ మరింత క్షీణిస్తోందని, వర్షాకాలంలో గుంతలు నీటితో నిండిపోవడం వాహనదారులకు ముప్పుగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వైద్య అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు సమయానికి ఆసుపత్రులకు చేరుకోలేక ఇబ్బందులు పడుతుండగా, మరోవైపు విద్యార్థులు, ఉద్యోగులు ప్రతిరోజూ ప్రమాద భయంతోనే ప్రయాణం చేస్తున్నారు.

విశేషమేమిటంటే ఇదే రహదారిపై ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా తరచుగా రాకపోకలు సాగిస్తున్నా సమస్యపై స్పందన లేకపోవడం స్థానికులకు మరింత కోపాన్ని రేకెత్తిస్తోంది. "ప్రజల సమస్యలు పట్టించుకోని అధికారులకు, నాయకులకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతాం" అని మండిపడుతున్నారు. ప్రజల ఆవేదనను పరిగణనలోకి తీసుకొని రహదారి మరమ్మతులు అత్యవసరమని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Next Story