- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఎక్కడంటే..?
నాగర్ కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది.

దిశ ,నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న దీపక్ శర్మ అనే విద్యార్థిని సీనియర్ విద్యార్థులు హర్షవర్ధన్ , సెకండ్ ఇయర్ విద్యార్థి లోకేష్, హిమ వర్ధన్ లు ముగ్గురు కలిసి ర్యాగింగ్ చేశారు. దీపక్ శర్మను తమ రూమ్ కి పిలిచి.. గోడ కుర్చీ వేయాలని,లేదా సిలిండర్ ఉన్నట్లు మోయాలని పనిష్మెంట్ ఇచ్చారు. మళ్లీ 30 నిమిషాలు గాలి కూర్చి వేయమని తెలిపారు. తన ఫోన్ తీసుకొని వ్యక్తిగత ఫోటోలు ,వీడియోలు తీసి వాటిని ప్రిన్సిపల్ కు,మీ తల్లిదండ్రులకు పంపుతామని బెదిరించారు. తన యూపీఐ పిన్ నెంబర్ చెప్పకపోవడంతో.. కోపానికి లోనై బెల్టుతో చితకబాదారు. బాధితుడు వారి నుంచి తప్పించుకొని నేరుగా ఈనెల 26న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కాగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.






