- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిల్లలకు ఆస్తి పంచేటప్పుడు కండీషన్లు పెట్టండి : డీఎల్ఎస్ఏ కార్యదర్శి జడ్జీ ఇందిర
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : తల్లితండ్రులు తమ పిల్లలకు ఆస్తి పంచేటప్పుడు కాని, బహుమతి గా ఇచ్చేటప్పుడు కానీ తాము ఉన్నంత వరకు తమ బాగోగులు చూడాలనే షరతు పెట్టాలని

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : తల్లితండ్రులు తమ పిల్లలకు ఆస్తి పంచేటప్పుడు కాని, బహుమతి గా ఇచ్చేటప్పుడు కానీ తాము ఉన్నంత వరకు తమ బాగోగులు చూడాలనే షరతు పెట్టాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఇందిర సూచించారు. అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాలలో సందర్భంగా స్థానిక సీనియర్ సిటిజన్ ఫోరం కార్యాలయంలో 'తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం-2007' పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. వృద్ధుల సంరక్షణ కోసం 2007 లో చేసిన చట్టం కఠినంగా ఉందని, పిల్లలు తమ తల్లిదండ్రులను పోషణ చూడకపోయినా, పోషణకు అవసరమైన ఖర్చులు ఇవ్వకపోయినా, వారికి 3 నెలలు జైలు శిక్ష, 5 వేల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని, ఈ చట్టం కింద ఫిర్యాదు చేయడానికి వృద్ధులు నేరుగా ఆర్డీవో ను సంప్రదించవచ్చని జడ్జి తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారిణి జరీనా బేగం మాట్లాడుతూ, వృద్ధులు, మహిళలు,దివ్యాంగుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫోరం ఉపాధ్యక్షుడు రాజసింహుడు, కార్యదర్శి నస్కంటి నాగభూషణం, సాయిల్ గౌడ్, అంజయ్యాచారి, శివ్వన్న పంతులు, రాములు, ఎల్.గంగాధర్, బాలయ్య, నాగరాజు పాల్గొన్నారు.






