- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి : కలెక్టర్ ఖుష్బూ గుప్తా
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన ఫిర్యాదులకు ప్రాధాన్యతనిచ్చి పెండింగ్ లో ఉంచకుండా సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్త అధికారులను ఆదేశించారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన ఫిర్యాదులకు ప్రాధాన్యతనిచ్చి పెండింగ్ లో ఉంచకుండా సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్త అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన మొత్తం 165 ఫిర్యాదులను కలెక్టర్ తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ లకు విన్నవించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలు శ్రద్ధగా విని సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి ఎండార్స్ చేస్తూ ఫిర్యాదులు పరిష్కారం చేయాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ మాట్లాడుతూ సిఎం కార్యాలయం నుండి వచ్చిన ఫిర్యాదులు, ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ కు అందిన ఫిర్యాదులు మూడు నెలల కు మించి పెండింగ్ లో నున్న ఫిర్యాదులు అన్ని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో భూసేకరణ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాంరెడ్డి, జిల్లా పరిషత్ సిఈఓ వెంకట్ రెడ్డి, డిఆర్డీఓ నరసింహులు, ఆర్డీఓ నవీన్ తదితరులు పాల్గొన్నారు.
స్పాట్ వాల్యుయేషన్ పారదర్శకంగా జరగాలి
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ క్యాంపు ను సోమవారం జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్త సందర్శించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, వాల్యుయేషన్ సమయానికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, అలాగే క్యాంపులో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ విద్యాధికారి, అధికారులు, క్యాంపు ఇన్‌చార్జ్‌లు వాల్యుయేషన్‌లో పాల్గొంటున్న అధ్యాపకులు పాల్గొన్నారు.
హెల్ప్ లైన్ గోడ ప్రతుల ఆవిష్కరణ
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక లో 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్ లో మహిళా, శిశు, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన హెల్ప్ లైన్ నెంబర్స్ గోడ ప్రతులను జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిబ్ల్యూవో ఎస్.జరీనా బేగం మాట్లాడుతూ గోడ ప్రతులను జిల్లాస్థాయి నుండి గ్రామస్థాయి వరకు డిస్ల్పే చేసి అందరికీ ఈ నెంబర్ల యొక్క ఆవశ్యకతను గురించి తెలియచేయడం జరుగుతుందని ఆమె తెలిపారు.






