ప్రజల భద్రతే పోలీసుల లక్ష్యం

by Ratna Kumari |

మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ పోలీస్ స్టేషన్‌ను సోమవారం ఎస్పీ డీ. జానకి ఆకస్మికంగా సందర్శించారు.

ప్రజల భద్రతే పోలీసుల లక్ష్యం
X

దిశ, హన్వాడ : మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ పోలీస్ స్టేషన్‌ను సోమవారం ఎస్పీ డీ. జానకి ఆకస్మికంగా సందర్శించారు. పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి స్టేషన్ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అధికారులు ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతగా స్వీకరించి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. నేరాల నియంత్రణలో పోలీసులు అప్రమత్తంగా ఉండి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న “అర్రైవ్ అలైవ్ ” కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రతపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు.

రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని, హెల్మెట్ వినియోగం, అతివేగం నియంత్రణ, మద్యం సేవించి వాహనాలు నడపకుండా ఉండేలా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. అలాగే మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ప్రమాదాలు, సమాజంపై పడే ప్రతికూల ప్రభావాల గురించి ప్రజలకు, ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హన్వాడ ఎస్సై వెంకటేష్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story