పీఆర్టీయూ టీఎస్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-01-03 13:48:21  IST  )

మహమ్మదాబాద్ మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం పీఆర్టీయూ టీఎస్ (PRTU TS) ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను జిల్లా, రాష్ట్ర నాయకులు, ప్రజాప్రతినిధులు ఆవిష్కరించారు.

పీఆర్టీయూ టీఎస్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
X

దిశ‌, మ‌హ‌మ్మ‌దాబాద్ : మహమ్మదాబాద్ మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం పీఆర్టీయూ టీఎస్ (PRTU TS) ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను జిల్లా, రాష్ట్ర నాయకులు, ప్రజాప్రతినిధులు ఆవిష్కరించారు. మండల పీఆర్టీయూ టిఎస్ అధ్యక్షులు బీజం భీంరెడ్డి ప్రధాన కార్యదర్శి పుట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా పీఆర్‌టీయూ టీఎస్ అధ్యక్షులు మదన్మోహన్ యాదవ్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జీపీఎఫ్ పార్ట్ ఫైనల్, మెడికల్ బిల్లులు, సలెండర్ లీవులు, డీఏలు, పీఆర్‌సీ సహా ఉపాధ్యాయులకు రావలసిన అన్ని ఆర్థికపరమైన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని పీఆర్టీయూ టీఎస్ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షునిగా ప్రభుత్వాన్ని కోరారు.


పీఆర్‌టీయూ టీఎస్ సంఘం ఎల్లప్పుడూ ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ, విద్యా ప్రమాణాల అభివృద్ధి, సామాజిక బాధ్యతల నిర్వహణలో ముందుండి ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. ఆ మహత్తర లక్ష్యాలను గుర్తు చేస్తూ ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేసే విధంగా ఈ నూతన సంవత్సర క్యాలెండర్‌ను రూపొందించామని చెప్పారు. మహమ్మదాబాద్ గ్రామ సర్పంచ్ రామ్ లాల్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కే.ఎం. నారాయణ, మాజీ ఎంపీపీ శాంతి, మండల విద్యాధికారి రాజు నాయక్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జి. సురేందర్ రెడ్డి, బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ష‌మీ, పాండురంగారెడ్డి, పీడీ శ్రీనివాస్ రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, శంకర్, మండల గౌరవ సలహాదారు రవీందర్ రెడ్డి, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి గీత, రాష్ట్ర నాయకులు విజయ్ కుమార్ గౌడ్, పండు గౌడ్, తిరుపతి రెడ్డి, బాలరాజ్ గౌడ్, ఖాదర్, రాము, హనుమంతు, గడ్డం వెంకటేష్, మంజుల, వనజలత, వెంకట్, బసయ్య, మల్లేష్ పాల్గొన్నారు.

Next Story