ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే మీరిచ్చే పెద్ద బహుమతి : మంత్రి వాకిటి శ్రీహరి

by Bhoopathi Nagaiah |

ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే నాకు మీరిచ్చే పెద్ద బహుమతి అని మంత్రి వాకిటి శ్రీహరి నూతనంగా బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కౌన్సిలర్లతో అన్నారు.

ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే మీరిచ్చే పెద్ద బహుమతి : మంత్రి వాకిటి శ్రీహరి
X

దిశ, మక్తల్ : ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే తమకు ఇచ్చే పెద్ద బహుమతి అని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్ పెద్ద ఊరుగా విస్తరించినా.. పదవి బాధ్యతలు చేపట్టిన వారంతా చిన్న వయస్సు వారే అని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మక్తల్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేసిన చైర్మన్, వైస్ చైర్మన్ , ప్రమాణ స్వీకారం చేసిన వారందరికి మంత్రి వాకిటి శ్రీహరి శాలువాలతో సన్మానం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడూతూ 25 ఏళ్ల కిందట సర్పంచిగా వాకిటి శ్రీహరి గెలిచి, 5 ఏళ్ల పాలనలో గ్రామస్తులకు మౌలిక వసతులు కల్పించడంలో ఎంతో శ్రద్ద వహించారని, అందుకు గాను మళ్లీ జెడ్పిటీసీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎదిగారని అన్నారు.

చిన్న వయస్సులోనే మున్సిపాలిటీ కౌన్సిలర్స్‌గా బాధ్యతలు చేపట్టిన వారు మున్సిపల్ ప్రజలకు మౌలిక వసతులు తాగునీరు, వీధిదీపాలు, గల్లిలో శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అంతే కాకుండా వార్డు సభ్యులు ప్రజల సాధక బాధలపై నిబద్ధతగా, నిజాయితీగా పనిచేయాలని సూచించారు. ఊరి ప్రజలకు మౌలిక వసతులు కల్పించడానికి, కౌన్సిలర్‌గా విధులు నిర్వహించడానికి సమయం, వయస్సు చాలా ఉన్నాయని అన్నారు. ప్రతి ఒక్కరు మక్తల్ మున్సిపాలిటీ అభివద్ధికి సహకరించాలని, అదే తమకు ఇచ్చే పెద్ద బహుమతి అని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు.

Next Story