భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వండి

by velandi.Saikiran |

భారీ వర్షాలతో రైతులు వేసిన పంటలు నష్టపోయారని రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్

భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వండి
X

దిశ, బిజినేపల్లి: భారీ వర్షాలతో రైతులు వేసిన పంటలు నష్టపోయారని రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ టిఆర్ఎస్ మండలాధ్యక్షులు మొత్తం పులేందర్ రెడ్డిలు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ యూరియా విష‌యంలో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంద‌ని ఆగ్రహించారు.

వార్డు మెంబర్ కూడా గ్రామాలలో గెలవని వారు కూడా స్థాయి మరిచి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే తగిన బుద్ధి చెబుతామ‌ని హెచ్చరించారు. అగ్రికల్చర్ బీఎస్సీ ,మెడికల్ కళాశాల, పాలెం చెరువు బ్రిడ్జి, వట్టేం రాకపోకలకు అంతరాయం కలగకుండా బ్రిడ్జి వేసి ఎన్నో మంచి పనులు చేసిన ఘనుడు మర్రి జనార్దన్ రెడ్డి అని ఈ సందర్భంగా కొనియాడారు. ఆయనతోపాటు మాజీ రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు నెల్లికంటి మహేశ్వర్ రెడ్డి, తిరుపతిరెడ్డి, బాలస్వామి, లక్ష్మయ్య, మహేష్, అల్లోజి తో పాటు తదితరులు ఉన్నారు.

Next Story