ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

by Elthuri vijay kumar |

పోలీసులు క్రమశిక్షణ, సమయపాలనతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జోగులాంబ జోన్–VII డీఐజీ ఎల్‌.ఎస్‌. చౌహాన్ సూచించారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
X

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి ఉంచాలి

జాతీయ రహదారిపై ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టాలి

జోగులాంబ జోన్ -VII డీఐజీ ఎల్ఎస్ చౌహన్

దిశ, దేవరకద్ర: పోలీసులు క్రమశిక్షణ, సమయపాలనతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జోగులాంబ జోన్–VII డీఐజీ ఎల్‌.ఎస్‌. చౌహాన్ సూచించారు. బుధవారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని మూసాపేట పోలీస్ స్టేషన్, భూత్పూర్ సర్కిల్ ఆఫీస్, జడ్చర్ల టౌన్ పోలీస్ స్టేషన్, బాలానగర్ పోలీస్ స్టేషన్లను వార్షిక తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్లలో రికార్డుల నిర్వహణ, పరిశుభ్రత, కేసుల దర్యాప్తు నాణ్యతపై సమీక్ష నిర్వహించారు. డయల్ 100 కాల్స్‌ కు వేగంగా స్పందించి ప్రజలకు నమ్మకం కల్పించాలని, ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి భద్రతా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. జాతీయ రహదారి–44పై ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. దొంగతనాలు, అక్రమ వ్యాపారాల నివారణకు నిఘా బలపరచాలని, పాత నేరస్తులపై కఠిన నిఘా ఉంచాలని తెలిపారు. పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డీఐజీ సూచించారు. ఈ తనిఖీల్లో జిల్లా ఎస్పీ డి.జానకి ఐపీఎస్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, భూత్పూర్ సీఐ రామకృష్ణ, జడ్చర్ల టౌన్ ఇన్స్పెక్టర్ కమలాకర్, జడ్చర్ల రూరల్ సీఐ నాగార్జున గౌడ్, ముసాపేట ఎస్సై వేణు, బాలానగర్ ఎస్ఐ లెనిన్ తదితరులు పాల్గొన్నారు.

Next Story