వంట వార్పు తో నిరసన..

by Ratna Kumari |

మండ‌ల ప‌రిధిలో బీసీ సంఘాల నాయ‌కులు పెద్ద ఎత్తున బంద్ లో పాల్గొన్నారు. అన్ని పార్టీల నాయ‌కులు బంద్ కి మ‌ద్ద‌తు తెలిపారు.

వంట వార్పు తో నిరసన..
X

దిశ,మిడ్జిల్ : మండ‌ల ప‌రిధిలో బీసీ సంఘాల నాయ‌కులు పెద్ద ఎత్తున బంద్ లో పాల్గొన్నారు. అన్ని పార్టీల నాయ‌కులు బంద్ కి మ‌ద్ద‌తు తెలిపారు. విద్యాసంస్థ‌లు, వాణిజ్య‌, వ్యాపార స‌ముదాయాలు స్వ‌చ్ఛందంగా మూసివేశారు.అనంత‌రం రోడ్డుపై వంట వార్పు కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా బీసీ నాయ‌కులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయని, జనాభాలో సగం ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే వరకు బీసీలందరూ సంఘటితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బీసీ జేఏసీ నాయ‌కులు పాండు, శ్రీనివాస్ గౌడ్, మామిడిమ‌డ భాస్క‌ర్, సుద‌ర్శ‌న్, గంజి కృష్ణ‌, సురేష్, బాల‌య్య‌, మతిన్, భాస్క‌ర్, బుచ్చ‌య్య‌, వెంక‌ట‌య్య‌, శ్రీనివాసులు, న‌ర‌సింహ‌, శ్రీను నాయ‌క్, నాగ‌య్య‌, న‌రేష్ నాయ‌క్, సుకుమార్, జ‌గ‌న్ గౌడ్, దాన‌య్య‌, గోపాల్, రాఘ‌వేంద‌ర్, న‌వీన్, ప్ర‌శాంత్, శ్రీధ‌ర్ పాల్గొన్నారు.

Next Story