42 శాతం రిజర్వేషన్ అడుకున్నందుకు వ్యతిరేకంగా నిరసన

by Ratna Kumari |

దిశ, వనపర్తి టౌన్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అడ్డుకున్నందుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని శుక్రవారం వనపర్తి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సీపీఎం

42 శాతం రిజర్వేషన్ అడుకున్నందుకు వ్యతిరేకంగా నిరసన
X

దిశ, వనపర్తి టౌన్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అడ్డుకున్నందుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని శుక్రవారం వనపర్తి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సీపీఎం వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పార్టీ పట్టణ కార్యదర్శి పరమేశ్వర్ ఆచారి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఎం వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.డీ. జబ్బార్ పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం తమ ద్వాంద వైఖ‌రి మానుకొని 9 వ షెడ్యూల్ సవరించడం ద్వారానే 42 శాతం రిజర్వేషన్ సాధ్యం అన్నారు. వారికి చిత్తశుద్ధి ఉంటే ఈ దిశగా చర్యలు చేపట్టాలన్నారు. బీసీ జేఏసీ పోరాడితేనే ఈనెల 18న త‌ల‌పెట్టిన బంద్ కి స‌హ‌క‌రిస్తామ‌ని తెలిపారు. లేదంటే తామే స్వ‌యంగా ఉద్య‌మిస్తామ‌ని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.రాజు, ఏ. లక్మి, జిల్లా కమిటీ సభ్యులు మేకల ఆంజనేయులు, పట్టణ నాయకులు డి. కురుమయ్య, మదన్, గంధం గట్టయ్య, జి. బాలస్వామి, రమేష్, జి. రాబర్ట్, సాయి లీల, బాల పీరు, ఉమ, నందిమల్ల రాములు, ఎల్లయ్య, దేవరాజు, మద్దిలేటి, జి భాస్కర్, డి. బాలరాజు పాల్గొన్నారు.

Next Story