ఉండ‌వెల్లిలో వ్య‌భిచారం గుట్టుర‌ట్టు..!

by Ratna Kumari |   (  Updated:2026-03-26 16:54:07  IST  )

లాడ్జిలో వ్యభిచారం చేస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలోని పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

ఉండ‌వెల్లిలో వ్య‌భిచారం గుట్టుర‌ట్టు..!
X

దిశ, ఉండవెల్లి : లాడ్జిలో వ్యభిచారం చేస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలోని పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్సై శేఖ‌ర్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఉండవెల్లి మండల కేంద్రం 44వ జాతీయ రహదారి వికేర్ కోల్డ్ స్టోర్జి సమీపంలోని గీతా లాడ్జి లో మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో వ్యభిచారం నడుస్తుందన్న నమ్మదగిన సమాచారం మేరకు ఎస్ఐ శేఖర్ తన సిబ్బందితో లాడ్జి పై దాడులు చేశారు. ఈ దాడులలో ముగ్గురు విటులు, ఒక మహిళతో వ్యభిచారం చేస్తూ పట్టుబడిన్నారు. లాడ్జిలో వ్యభిచారం చేస్తూ పట్టుబడిన వ్యక్తులు ఇటిక్యాల మండలంలోని బుడారెడ్డిపల్లి, కోదండపురం గ్రామానికి చెందిన వ్యక్తులు గా గుర్తించారు. పట్టుబడిన మహిళ పచ్చిమ బెంగాల్ రాష్ట్రం కలకత్తా కు చెందిన వ్యక్తిగా పోలీసులు పేర్కొన్నారు. వైద్య పరీక్షల అనంతరం మహిళ ను గద్వాల సఖి కేంద్రం కు తరలించారు. నలుగురితో పాటు లాడ్జి ఓనర్ పై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు కొన్నసాగిస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Next Story