- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి : బీఆర్ఎస్వీ
ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్వీ జిల్లా నాయకుడు డీ. శేఖర్ డిమాండ్ చేశారు.

దిశ, పెద్దకొత్తపల్లి : ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్వీ జిల్లా నాయకుడు డీ. శేఖర్ డిమాండ్ చేశారు. గురువారం పెద్ద కొత్తపల్లి ఎస్సీ హాస్టల్ ను సందర్శించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను బీఆర్ఎస్వీ జిల్లా నాయకుడు డి శేఖర్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీ ఆర్ఎస్వీ జిల్లా నాయకుడు డి శేఖర్ మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ హాస్టల్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హాస్టల్ మూసివేయడానికి సమయం దగ్గర వచ్చిన ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం సబ్బుల బిల్లును విడుదల చేయలేదని ఆయన అన్నారు. తక్షణమే విద్యార్థులకు బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు .హాస్టల్ లో టాయిలెట్స్ డోర్లను ఏర్పాటు చేసి స్థానిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హాస్టల్ మెను అమలు చేయాలని విద్యార్థులకు నాణ్యత మైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు.






