- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుత్ ఆర్టిజన్ ల సమస్యలు పరిష్కరించాలి : మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ మాజీమంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ మాజీమంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక జిల్లా కేంద్రంలోని విద్యుత్ సర్కిల్ కార్యాలయం ముందు విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె శిబిరంలో ఆయన పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ప్రసంగించారు. విద్యార్హతల ఆధారంగా ఆర్టిజన్ ఉద్యోగులను కన్వర్షన్ చేయాలని, విద్యుత్ పంపిణీ సంస్థలో పనిచేస్తున్న అన్ మ్యాన్డ్ వర్కర్లను ఆర్టిజన్లుగా గుర్తించాలనే మొత్తం 6 డిమాడ్లను పరిష్కరించాలని ఆయన కోరారు. తమ ప్రభుత్వ హయాంలో సరఫరా చేసిన నాణ్యమైన విద్యుత్ తో ట్రాన్సఫారాలు కాలిపోయేవి కావని, ఆర్టిజన్లకు అధిక పనిభారం లేకుండేదని ఆయన అన్నారు. కీలకమైన పెద్ద సంస్థలో పనిచేస్తున్న చిన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.






