మా అమ్మాయిది ఆత్మహత్య కాదు.. ముమ్మాటికి హత్యే..!

by Nallavelli.Anjaneyulu |

దిశ, గద్వాల క్రైమ్ : గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామానికి చెందిన కానిస్టేబుల్ రాఘవేంద్ర గౌడ్ తనను ప్రేమించి పెళ్లి చేసుంకుంటాన‌ని మోసం చేశాడంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,

మా అమ్మాయిది ఆత్మహత్య కాదు.. ముమ్మాటికి హత్యే..!
X

దిశ, గద్వాల క్రైమ్ : గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామానికి చెందిన కానిస్టేబుల్ రాఘవేంద్ర గౌడ్ తనను ప్రేమించి పెళ్లి చేసుంకుంటాన‌ని మోసం చేశాడంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ గ్రామానికి చెందిన ప్రియాంక గత కొన్ని రోజుల నుంచి చిన్నొన్నిపల్లి గ్రామంలో తనకు న్యాయం చేయాల‌ని పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. అయితే పోరాటంలో భాగంగానే ఈ నెల 04న ఆత్మహత్యకు పాల్పడి చికిత్స పొందుతూ మరణించింది. గట్టు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి 22మంది మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాఘవేంద్ర గౌడ్ ని నిన్న పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే మా అమ్మాయి ప్రియాంక ఆత్మహత్య చేసుకునేంతా పిరికిది కాదని.. ఆమెది ముమ్మాటికి హత్యనే అంటూ గద్వాల ఎస్పీ శ్రీనివాస్ రావును కలసి పిర్యాదు చేశారు. తమ కూతురు మరణం వెనుక చాలా అనుమానాలున్నయని ఎస్పీకీ తెలిపారు.

ఎవ్వ‌రినీ వ‌దిలి పెట్టం డీఎస్పీ మొగిల‌య్య

ప్రియాంక ఆత్మహత్యకు కారకులైన వారని ఎవరిని వదిలిపెట్టమని ఇప్పటికే 22మందిపై కేసులు చేసి ఒకరిని రిమండ్ చేశామని డీఎస్పీ మొగిలయ్య తెలిపారు. అలాగే ఇంక కేసు విచారణ జరుగుతుందని ప్రియాంక ఆత్మహత్య ప్రేరణకు కారకులు ఎవరైన ఉన్నరా అనే కోణంలో కూడ కేసు విచారణ చేస్తున్నామని అలా ఎవరైన ఉన్న వారిపై కూడ కేసులు నమోదు చేస్తామ‌ని తెలిపారు. ప్రస్తుతం ప్రియాంక కాల్ డేటా,బ్యాంక్ లావాదేవీలపై కూడ ఆరా తీస్తున్నమని డీఎస్పీ మొగిలయ్య తెలిపారు. అన్ని కోణాల్లో కేసును విచారణ చేస్తున్నమని ప్రియాంక ఆత్మహత్య కేసులో ఎంతటివారైన సరే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వారిపై చట్టపరమైన చర్యలుంటాయని ఆయన తెలిపారు.

Next Story