- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > MLA : ప్రియాంక ఆసుపత్రిలో బాలింత మృతి ఘటన పై స్థానిక ఎమ్మెల్యే సీరియస్..
MLA : ప్రియాంక ఆసుపత్రిలో బాలింత మృతి ఘటన పై స్థానిక ఎమ్మెల్యే సీరియస్..
by Batti.Sumithra |
నాగర్ కర్నూల్ పట్టణంలోని ప్రియాంక ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో కావ్య (23) బాలింత మృతి చెందింది.

X
దిశ, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ పట్టణంలోని ప్రియాంక ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో కావ్య (23) బాలింత మృతి చెందింది. ఈ ఘటన పై స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సీరియస్ అయ్యారు. మంగళవారం సాయంత్రం ఆయన కావ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులు, రాజకీయ పార్టీలు, ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆసుపత్రి వైద్యురాలు నిర్లక్ష్యం వరస సంఘటనల పై ఎమ్మెల్యేకు వివరించారు. అందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ.. జిల్లా కలెక్టర్, ఎస్పీకి దృష్టికి తీసుకువెళ్లి నిర్వాహకుల పై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రిని సీజ్ చేసి వైద్యురాలి పై కఠిన చర్యలు తీసుకుంటామని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
Next Story






