ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి : జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత

by Nallavelli.Anjaneyulu |

వివిధ కేసుల్లో జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత అన్నారు.

ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి : జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : వివిధ కేసుల్లో జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత అన్నారు. ఈ సందర్భంగా ఆమె జిల్లా జైలు లో శిక్షలు అనుభవిస్తున్న ఖైదీల బ్యారక్ లను కలియతిరిగారు. లీగల్ ఎయిడ్ క్లినిక్ పనితీరును జైలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జైలులో వంటశాలను, పరిసరాలను పరిశీలించారు. అక్కడి వారికి, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతను తమ వ్యక్తిగత బాధ్యతగా భావించి ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తే అనేక ప్రాణాలను రక్షించవచ్చని, ప్రమాదాలను నివారించవచ్చని, రోడ్డు భద్రత పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి డి.ఇందిర, జైల్ సూపరింటెండెంట్ ఏ.వెంకటేశం, జైల్ మెడికల్ ఆఫీసర్ డా.మీర్జా అలి బేగ్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ రవీందర్ నాయక్, సభ్యులు యోగేశ్వరరాజ్, మల్లారెడ్డి, శివరాజు పాల్గొన్నారు.

Next Story