- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశ సేవలో ముందు.. గ్రామ సేవకై నామినేషన్
దిశ, ఉండవెల్లి : దేశ సేవ కోసం గ్రామాన్ని విడిచి దేశ సరిహద్దులో విధులు నిర్వహించిన ఆర్మీ రిటైర్డ్ ఆఫీసర్ ఒకపక్క, టెన్త్ బెటాలియన్ లో ఏఎస్ఐ గా విధులు నిర్వహించి రిటైర్డ్ అయిన

దిశ, ఉండవెల్లి : దేశ సేవ కోసం గ్రామాన్ని విడిచి దేశ సరిహద్దులో విధులు నిర్వహించిన ఆర్మీ రిటైర్డ్ ఆఫీసర్ ఒకపక్క, టెన్త్ బెటాలియన్ లో ఏఎస్ఐ గా విధులు నిర్వహించి రిటైర్డ్ అయిన అధికారి మరోపక్క సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేసేందుకు శుక్రవారం నామినేషన్లు వేశారు. దీంతో ఉండవల్లి మండలంలో ఆర్మీ పోలీస్ శాఖల అధికారుల సర్పంచ్ ఎన్నికల పోటీ చర్చనీయాంశంగా మారింది. వివరాలలోకి వెళ్ళితే ఉండవల్లి మండలం మారమునగాల 2 గ్రామానికి చెందిన సురేష్ గౌడ్ దేశానికి సేవ చేసేందుకు ఆర్మీలో పనిచేసే 2018లో రిటైర్మెంట్ అయ్యారు. అలాగే ఇదే గ్రామానికి చెందిన కమతం శ్రీనివాసులు ఎర్రవల్లి మండల కేంద్రంలోని టెన్త్ బేటాలియన్ లో ఏఎస్ఐగా విధులు నిర్వహించి ఆరు నెలల కిందటనే రిటైర్మెంట్ అయ్యారు. మారమునగాల2 గ్రామపంచాయతీ రిజర్వేషన్ లో భాగంగా బీసీ జనరల్ కావడంతో సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేసేందుకు రిటైర్మెంట్ అయిన ఇద్దరు అధికారులు శుక్రవారం నామినేషన్ వేయడంతో తీవ్ర పోటీ నెలకొన్నది. ఈ ఇద్దరి అధికారులను ఆదర్శంగా తీసుకొని ఈ గ్రామం నుండి ఎంతోమంది యువకులు అనేక పోటీ పరీక్షలలో ఉత్తీర్ణులై ఉద్యోగాలు సాధిస్తున్నారు. నేడు జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలలో ఈ ఇద్దరు అధికారులు పోటీపడుతుండడం విశేషం. గ్రామంలో అనేక సమస్యలు ఉన్న ఇప్పటివరకు గత నాయకులు పట్టించుకోకపోవడం వల్లనే ఉన్నత చదువులు చదివి గ్రామానికి సేవ చేసేందుకు ముందుకు వచ్చినట్లు పోటీ చేస్తున్న అభ్యర్థులు పేర్కొన్నారు. ఇద్దరు ఉన్నత విశ్రాంత ఉద్యోగులు పోటీకి ముందుకు రావడంతో గ్రామస్తులు యువకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






