- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులను చితకబాదిన గురుకుల ప్రిన్సిపాల్
గద్వాల జిల్లా ఉండవెల్లి మండల పరిధిలోని అలంపూర్ చౌరస్తాలోని మహాత్మా జ్యోతిరావు బాపూలే గురుకుల పాఠశాలలో విద్యార్థులను చితకబాదిన ప్రిన్సిపల్ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

దిశ, అలంపూర్ / ఉండవెల్లి : మండలంలోని అలంపూర్ చౌరస్తా మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులను బ్యాక్ ప్రైవేట్ పార్ట్స్ పై ప్రిన్సిపాల్ కర్రతో విచక్షణ రైతంగా కొట్టిన ఘటన చోటు చేసుకున్నది. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ బాలుర పాఠశాలలో ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు విద్య కొనసాగుతున్నది. పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాసేందుకు సోమవారం పాఠశాల నుంచి పరిక్ష కేంద్రం కు వెళ్లారు. పదో తరగతి విద్యార్థులు ఉంటున్న హాస్టల్ గదిలోకి 7, 8, 9తరగతి కి చెందిన కొంత మంది విద్యార్థులు తాళాలు పగలకొట్టి పదో తరగతి విద్యార్థులకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు నోట్ బుక్స్ వారికి సంబంధించిన వివిధ వస్తువులను విద్యార్థులు అపహరించి హాస్టల్ గారిని చిందర బొందరగా చేశారు.
పరీక్ష పూర్తి చేసుకుని వచ్చిన పదో తరగతి విద్యార్థులకు తమకు సంబంధించిన వస్తువులు అపహరణకు గురైనట్టు ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకుని వెళ్లారు. దీంతో ప్రిన్సిపాల్ సీసీ కెమెరాలను పరిశీలించి సంఘటనకు సంబంధించిన విద్యార్థులను ప్రత్యేకంగా ఒక గదికి పిలిపించుకొని విచక్షణారహితంగా కర్రతో విద్యార్థుల బ్యాక్ పార్ట్స్ పై కొట్టారు. దీంతో విద్యార్థులకు కమిలిన గాయాలయ్యాయి. దీంతో విద్యార్థులు సోమవారం జరిగిన ఘటనపై తల్లిదండ్రులకు చెప్పి బోరున విలపించారు. తల్లిదండ్రులు వెళ్లి చూడగా విద్యార్థులకు తీవ్ర కమిలిన గాయాలు ఉండడంతో ఉపాధ్యాయులతో బోరున విలపించారు. సంఘటనకు సంబంధించిన వ్యక్తులపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామని విద్యార్థుల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయులను హెచ్చరించారు. దీంతో సంఘటన వెలుగులోకి వచ్చి చర్చనీయాంశంగా మారింది.
వివాదాస్పదంగా మారుతున్న ఉపాధ్యాయుల తీరు
మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల తీరు నిత్యం వివాదాస్పదంగా మారుతున్నది. గతంలో కూడా విద్యార్థులకు సరిగా భోజనం వసతులు అందించడం లేదని తాగేందుకు నీరు లేదని ప్రశ్నించినందుకు ప్రైవేటు వ్యక్తులు విద్యార్థులను కొట్టారని పాదయాత్రగా కలెక్టరేట్ కు బయలుదేరిన ఘటన గతంలో చోటు చేసుకున్నది. ప్రస్తుతం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థులను విచక్షణ రైతంగా కొట్టి గాయపరచడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఈ ఘటనపై పాఠశాల ప్రిన్సిపల్ రామకృష్ణను వివరణ కోరగా పదో తరగతి విద్యార్థులకు సంబంధించిన వస్తువులను అపహరించారని కారణంతో విద్యార్థులను దండించినట్టు తెలిపారు. ఇద్దరు విద్యార్థులను కర్రతో బెదిరించాను అని తెలిపారు.






