కార్పొరేట్ కి అనుకూల‌మైన విధానాలు అమ‌లు చేయ‌డమే ట్రంప్ ల‌క్ష‌ణం

by Ratna Kumari |   (  Updated:2026-01-10 12:38:11  IST  )

వెనిజులా మాజీ అధ్యక్షుడు మధురోను అక్రమంగా ఎత్తుకెళ్లడం ఒక సార్వభౌమాధికారం కలిగిన దేశం పైన దౌర్జన్యంగా వ్యవహరించడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ విమర్శించారు.

కార్పొరేట్ కి అనుకూల‌మైన విధానాలు అమ‌లు చేయ‌డమే ట్రంప్ ల‌క్ష‌ణం
X

దిశ‌, నారాయ‌ణ‌పేట జిల్లా ప్ర‌తినిధి : వెనిజులా మాజీ అధ్యక్షుడు మధురోను అక్రమంగా ఎత్తుకెళ్లడం ఒక సార్వభౌమాధికారం కలిగిన దేశం పైన దౌర్జన్యంగా వ్యవహరించడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ విమర్శించారు. శనివారం నారాయణపేట జిల్లా కేంద్రంలో ఎస్సార్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో సీపీఎం జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన ప్రసంగించారు. ఉక్రెయిన్ రష్యా, పాలస్తీనా ఇజ్రాయిల్ యుద్ధాలకు అమెరికన్ కారణమవుతుందని ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్నది అమెరికా అని అన్నారు. యుద్ధాలను ప్రేరేపించడం ఆయుధాలను అమ్ముకోవడం కార్పొరేట్ అనుకూల విధానాలు అమలు చేయడం ట్రంపు విధానాలుగా ఉన్నాయని అన్నారు. ప్రపంచంలో నిరుద్యోగం, దరిద్రం ఆకలి ఒకవైపు పెరిగిపోతున్నగా మరోవైపు ప్రపంచ సంపద అంతా కొద్దిమంది బడా కార్పొరేట్ శక్తుల్లో కేంద్రీకరించబడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టుబడిదారీ విధానాలు శాంతి , సౌభాగ్యాలను కాపాడలేవని అశాంతిని దరిద్రంను నిరుద్యోగమును పెంచి పోషిస్తాయని అన్నారు. ఈ మధ్యకాలంలో శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ దేశాల్లో ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసిన ఘటనలు మనం చూస్తున్నామని తెలిపారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన విరోచిత వారసత్వం కలిగిన దేశం భారతదేశం కానీ నేడు మన ప్రధానమంత్రి మాత్రం ప్రపంచ పోలీసుల వ్యవహరిస్తున్న ట్రంపు విధానాలను ఖండించడం లేదని విమర్శించారు.

దేశ ప్రధాని నరేంద్ర మోడీ బడా కార్పొరేట్ అనుకూల విధానాలు అవలంబిస్తూ కార్మిక ,కర్షక, కూలీల వ్యతిరేక విధానాలను గౌరవిస్తుందని విమర్శించారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు జిరాంజీ బిల్లును తెచ్చారని స్వాతంత్ర పూర్వం నుండి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలన్నిటిని యజమానులకు అనుకూలంగా మార్చేందుకు నాలుగు కార్మిక కోడ్లు తెచ్చారని, రైతును వ్యవసాయాన్ని బడా కంపెనీలకు అప్పజెప్పేందుకు గతంలో నల్ల చట్టాలను తీసుకొచ్చారని అన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టీ సాగర్ మాట్లాడుతూ కార్మిక రైతు కూలీల వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా సీపీఎం నికరంగా సమరశీలంగా పోరాటం చేస్తుందని తెలిపారు. విద్యుత్ ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర పన్నుతున్నారు అని అన్నారు. సంపద సంపన్నులకు దరిద్రము, నిరుద్యోగము పేదలకు అని నరేంద్ర మోడీ విధానాలు ఆవలంబిస్తున్నారు. దేశంలో మతోన్మాద విధానాల అవలంబిస్తూ ఆర్ఎస్ఎస్ విధానాలను తీసుకొస్తున్నారని విమర్శించారు. నేను కేంద్రంలో పరిపాలిస్తున్న పాలకులకు లౌకిక రాజ్యమన్న సోషలిజం అన్న నచ్చడం లేదని అందుకే భారత రాజ్యాంగంలో లౌకిక సోషలిస్ట్ పదాలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నదని చివరికి భారత రాజ్యాంగాన్ని మార్చి అసమానతల కూడుకున్న మనధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సీపీఎం పార్టీ మద్దతుతో నూతంగ ఎన్నికైన నల్గురు సర్పంచులను ఎర్రకండువాలతో అభినందించారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జి వెంకట్రాం రెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్ , అంజిలయ్యగౌడ్ , బల్ రామ్,పుంజనూర్ ఆంజనేయులు పాల్గొన్నారు.

Next Story