President Draupadi Murmu : ప్రత్యేక హెలికాప్టర్ లో శ్రీశైలం చేరుకున్న రాష్ట్రపతి

by Javid Pasha |   (  Updated:2022-12-26 07:51:41  IST  )

ప్రత్యేక హెలికాప్టర్ లో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము శ్రీశైలం చేరుకున్నారు.

President Draupadi Murmu : ప్రత్యేక హెలికాప్టర్ లో శ్రీశైలం చేరుకున్న రాష్ట్రపతి
X

దిశ, అచ్చంపేట : రాష్ట్రపతి ద్రౌపదిముర్ము సోమవారం ఉదయం హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా శ్రీశైలం దేవస్థానానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో రూ.43.08 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. ప్రసాద్ స్కీం కింద వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభించేందుకు విచ్చేసిన భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఉదయం 11.45 గంటలకు సున్నిపెంట హెలిప్యాడ్ కు చేరుకున్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంట తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్, ఏడి జీపీ ఎల్ఎల్ఓ రవిశంకర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామూన్, జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి తదితరులు ఘనంగా స్వాగతం పలికారు.

Next Story