మొక్కజొన్న రైతులను ఇబ్బంది పెడితే ధర్నాకు సిద్ధం : ఎమ్మెల్యే విజయుడు

by Ratna Kumari |

అలంపూర్ నియోజకవర్గంలో మొక్కజొన్న రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసి లారీలలో తరలించకుండా ఇబ్బందులకు గురి చేస్తే మూడు రోజుల్లో ధర్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు.

మొక్కజొన్న రైతులను ఇబ్బంది పెడితే ధర్నాకు సిద్ధం : ఎమ్మెల్యే విజయుడు
X
దిశ, ఉండవెల్లి : అలంపూర్ నియోజకవర్గంలో మొక్కజొన్న రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసి లారీలలో తరలించకుండా ఇబ్బందులకు గురి చేస్తే మూడు రోజుల్లో ధర్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రంను ఎమ్మెల్యే విజయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ మొక్కజొన్న చివరి గింజ కొనుగోలు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని తక్షణమే తరలించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని ఎమ్మెల్యే రైతులకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి రెండు రోజుల్లో ధాన్యాన్ని తరలించకపోతే, రైతుల పక్షాన మూడో రోజు నుంచి ధర్నాలు చేపడతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Next Story