- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం
దిశ, మహమ్మదాబాద్ : మండల కేంద్రంలోని రామాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమీక్షా సమావేశం నిర్వహించారు.

X
దిశ, మహమ్మదాబాద్ : మండల కేంద్రంలోని రామాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేఎం. నారాయణ అధ్యక్షత వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల వ్యూహాలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు నారాయణ మాట్లాడుతూ రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఎస్టీ సమాజానికి కేటాయించబడిన నేపథ్యంలో కాంగ్రెస్అధిష్టానం అభ్యర్థుల ఎంపికను సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఎంపీటీసీ, సర్పంచ్ లుగా గ్రామాల నుంచి పోటీ చేయదలచిన నాయకులు, కార్యకర్తలు తమ పేర్లను పార్టీకి సమర్పించాలని సూచించారు. సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి, సరైన అభ్యర్థులను ఎంపిక చేయడం పార్టీ అధిష్టానం బాధ్యతగా ఉందని అన్నారు. గత ఎన్నికల్లో ఉమ్మడి మండల ప్రజలు, నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ విజయానికి చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈ. రాములు, మాజీ ఎంపీపీ శాంతి రంగ్యా, మాజీ వైస్ ఎంపీపీ రాధా రెడ్డి, పీఎసీఎస్ డైరెక్టర్స్ కమతం మమతా రెడ్డి, ఈ. దశరథ్ గౌడ్, మండల కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడు హెచ్. ముకుందం, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story






