రంగాపూర్ నిరంజ‌న్ షావ‌లి ద‌ర్గాలో ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రార్థ‌న‌లు

by Ratna Kumari |

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ గందోత్సవం సందర్భంగా దర్గాను గురువారం ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సందర్శించి ప్రత్యేక ప్రార్థన చేశారు.

రంగాపూర్ నిరంజ‌న్ షావ‌లి ద‌ర్గాలో ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రార్థ‌న‌లు
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ గందోత్సవం సందర్భంగా దర్గాను గురువారం ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సందర్శించి ప్రత్యేక ప్రార్థన చేశారు. దర్గా ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరిగే జాతర ఉత్సవాలను పరిశీలించిన అనంతరం అక్కడ నూతనంగా నిర్మిస్తున్నట్టువంటి కరెంట్ ట్రాన్స్ ఫార్మ‌ర్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ రంగాపూర్ లో మత సామరస్యానికి ప్రతీక అయిన హజ్రత్ నిరంజన్ షావలి గంధోత్సవం, జాతర ఉత్సవాలు ఈనెల 17 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్కడికి వచ్చి దర్గాను దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశామన్నారు. ఈ జాతర ఉత్సవాలను తిలకించేందుకు వేలాది మంది భక్తులు రాష్ట్ర నలుమూలల నుంచి తరలివస్తారు. ఈ దర్గా ఎంతో మహిమ గలదని, ఈ దర్గాను దర్శించుకున్న భక్తుల కోరికలు తీరుతాయని ప్రసిద్ధి. ఎందరో జీవితాలను సరైన మార్గంలో చూపించిన ఈ దర్గాలో ప్రతి సంవత్సరం ఏదో ఒక మహిమ తప్పకుండా కనిపిస్తుందన్నారు. ఈ దర్గాను కుల, మతాలు అనే బేధం లేకుండా అందరూ కలిసి దర్శించుకుంటారన్నారు. ఈ యొక్క దర్గాకు పూర్వీకుల నుండి భక్తులు ఆనవాయితీగా వస్తుండడం విశేషం. ఈ దర్గా గంధం చరిత్ర 120 సంవత్సరాలు అని తెలిపారు. మతసామరస్యానికి ప్రతీక‌గా నిలిచినటువంటి ఈ దర్గాను ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాననీ తెలిపారు.

Next Story