పేదరిక నిర్మూలన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత

by Nallavelli.Anjaneyulu |

ఆర్థిక అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం పేదరిక నిర్మూలన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అన్నారు.

పేదరిక నిర్మూలన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత
X

దిశ, హన్వాడ : ఆర్థిక అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం పేదరిక నిర్మూలన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. గురువారం ఆయన హన్వాడ మండల పరిధిలోని ఇబ్రాహీంబాద్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు కావలి అంజమ్మ వెంకట్రాములుకు సంజీవ్ ముదిరాజ్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలెవ్వ‌రు ఇల్లు లేకుండా ఉండవద్దనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల‌ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. విద్య, వైద్యం మెరుగైన స్థాయిలో అందించడం ద్వారా పేదలు ఆర్థికంగా నిలదొక్కుకుంటారని, అందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చిత్తశుద్ధితో పని చేస్తుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలను పేదలకు చేర వేసేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైనికుల్లా పని చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు గోనెల శ్రీనివాస్, సర్పంచ్ యాదయ్య, నాయకులు పాలమూరు యాదయ్య, అంజి, పుల్లయ్య, వెంకటయ్య, బి చందు యాదవ్, వినయ్ కుమార్, చందు ముదిరాజ్ పాల్గొన్నారు.

Next Story