ప‌రిహారం అడిగిన రైతుకు మ‌ర‌ణించిన త‌రువాత రూ.10ల‌క్ష‌లు చెల్లింపు

by Ratna Kumari |

దిశ‌, రేవ‌ల్లి : పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్ లో ఓ రైతు పొలం ముంపునకు గురైంది. దీంతో ఆ రైతుకు ప‌రిహారం అంద‌లేదు. అయితే పరిహారం అందక అందులో వేసిన మినుము పంటను రిజర్వాయర్

ప‌రిహారం అడిగిన రైతుకు మ‌ర‌ణించిన త‌రువాత రూ.10ల‌క్ష‌లు చెల్లింపు
X

దిశ‌, రేవ‌ల్లి : పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్ లో ఓ రైతు పొలం ముంపునకు గురైంది. దీంతో ఆ రైతుకు ప‌రిహారం అంద‌లేదు. అయితే పరిహారం అందక అందులో వేసిన మినుము పంటను రిజర్వాయర్ పనులు నిర్వహిస్తున్నకాంటాక్టర్ వాహనాలు తిరిగి పంట పాడైంది. పొలం, పాడైన పంట పరిహారం చెల్లించాలని కోరినా రైతుని వేదింపులకు గురిచేశారు. దీంతో ఆ రైతు చేసేది ఏమి లేక‌ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతి చెందిన త‌రువాత రూ.10ల‌క్ష‌లు ప‌రిహారం అంద‌జేసి చేతులు దులుపుకున్నారు. ఈ సంఘటన వనపర్తి జిల్లా ఏదుల గ్రామంలో వెలుగులోకి వచ్చింది. వివ‌రాల్లోకి వెళ్లితే.. పాలమూరు-రంగారెడ్డి రిజర్వాయర్ పనులు కేఎన్ఆర్ కంపెనీ నిర్వహిస్తోంది. అయితే సబ్ కాంట్రాక్టర్ ఇదే గ్రామానికి చెందిన జిల్లెల్ల శ్రీనివాస్ రెడ్డికి అప్పగించింది. ఈక్రమంలో సబ్ కాంట్రాక్టర్ జిల్లెల్ల శ్రీనివాస్ రెడ్డికి చెందిన వాహనాలు తిరిగి రైతు కొమ్ము ఆంజనేయులు (45) మినుముల పంట పాడైంది. దీంతో మాజీ సర్పంచ్, సబ్ కాంట్రాక్టర్ అయిన శ్రీనివాస్ రెడ్డి ని తనపొలం ముంపునకు గురై పూర్తి పరిహారం అందక అందులో వేసిన మినిమ పంట పాడవుతుందని పొలం, పాడైన పంట పరిహారం చెల్లించాలని రైతు కోరాడు.


అయితే అత‌నిపై కక్ష కట్టి కేఎన్ఆర్ కంపెనీ ప్రతినిధి శేఖర్ రెడ్డితో కలిసి ప్రభుత్వ పనులను అడ్డుకుంటున్నాడని పోలీస్ పిర్యాదుచేసి వేదింపులకు గురిచేశారు. ఈ నేప‌థ్యంలో ఈనెల 22న‌ బుధవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్ప‌డ్డాడు. హైదరాబాద్ లో చికిత్సపొందుతూ శనివారం మృతి చెందాడు. దీంతో అతని మృతదేహంతో మండల కేంద్రం ఎదులలో ప్రధాన రహదారిపై ఉంచి కుటుంభ సభ్యులు, గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. వీరికి బీసీ పొలిటిక‌ల్ జేఏసీ రాష్ట్ర అద్యక్షుడు రచాల యుగేందర్ గౌడ్, సిపీఎం, బిజేపి పార్టీలనాయకులు ఎండి జబ్బార్, లోకనాథ్ రెడ్డి మద్దతు తెలిపారు. ఎట్టకేలకు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుఖేందర్ రెడ్డి , వనపర్తి సీఐ కృష్ణ, చొరవతో గ్రామ పెద్ద‌ల‌తో కలిసి కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి రూ.10ల‌క్ష‌లు పరిహారం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అశ్రునయనాలతో దహన సంస్కారాలు నిర్వహించారు. మృతుని భార్య అంజనమ్మ పిర్యాదు మేరకు వేదింపులకు గురిచేసిన గ్రామ మాజీ సర్పంచ్, సబ్ కాంట్రాక్టర్ శ్రీనివాస్ రెడ్డి పై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వనపర్తి సీఐ కృష్ణ తెలిపారు.

Next Story