- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హమాలీలు దేశ రవాణాలో కీలకం
హమాలీలు దేశ రవాణా రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: హమాలీలు దేశ రవాణా రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక గడియారం చౌరస్తా దగ్గర నియోజకవర్గ అభివృద్ధి నిధులతో హమాలీ సంఘం సభ్యుల కోసం నిర్మించిన విశ్రాంతి షెడ్డును ఆయన ప్రారంభించి ప్రసంగించారు. రవాణా వ్యవస్ధలో హమాలీలు లోడింగ్,అన్ లోడింగ్ చేస్తేనే సరకు రవాణా జరిగి సమాజం ముందుకు కదులుతుందన్నారు. కులమత బేదాలు లేకుండా అందరు కలసిమెలసి ఉండాలని ఆయన సూచించారు.
అంతకుముందు ఆయన హమాలీ సంఘం ఏర్పాటు చేసిన చలివేంద్రం ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి,ముడా చైర్మెన్ లక్ష్మణ్ యాదవ్,మార్కెట్ కమిటీ చైర్మెన్ బెక్కరి అనిత,మున్సిపల్ కమీషనర్ మహేశ్వర్ రెడ్డి,మున్సిపల్ మాజీ చైర్మెన్ ఆనంద్ గౌడ్,డిసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి,మైత్రి యాదయ్య,1టౌన్ సీఐ అప్పయ్య,తదితరులు పాల్గొన్నారు.






