- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ కి జై కొట్టిన పోలికేపహాడ్ సర్పంచ్
వనపర్తి జిల్లా గోపాలపేట మండలం పరిధిలోని పోలికేపహాడ్ గ్రామపంచాయతీ ఇండిపెండెంట్ సర్పంచ్ నక్క బగారయ్య యాదవ్, ఉప సర్పంచ్ జంపన్న, వార్డు మెంబర్లు, గ్రామానికి చెందిన 60 మంది నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

దిశ, గోపాల్ పేట : వనపర్తి జిల్లా గోపాలపేట మండలం పరిధిలోని పోలికేపహాడ్ గ్రామపంచాయతీ ఇండిపెండెంట్ సర్పంచ్ నక్క బగారయ్య యాదవ్, ఉప సర్పంచ్ జంపన్న, వార్డు మెంబర్లు, గ్రామానికి చెందిన 60 మంది నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ మేరకు వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి పోలికేపహాడ్ గ్రామ వద్ద ఏర్పాటు చేసిన చేరిక కార్యక్రమంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పోలికేపహాడ్ సర్పంచ్ మాట్లాడుతూ పోలికేపహాడ్ గ్రామ అభివృద్ధికై, నేడు ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేదలందరికీ లబ్ది చేకూరుతుందని కాంగ్రెస్ పార్టీ పథకాలకు ఆకర్షితులమై, ఎమ్మెల్యే మేఘారెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలు నచ్చి, నేడు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బంగారయ్య, ఉపసర్పంచ్ జంపన్నతో పాటు ఉమ్మడి మండల మండల ఇన్ చార్జి సత్యశిలా రెడ్డి, మాజీ జడ్పీటీసీ భార్గవి కోటిరెడ్డి వార్డు మెంబర్లు,వెంకటస్వామి, కర్ణాకర్, చరణ్, అబ్దుల్లా,సత్యం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






