- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సోమశీల వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే బీరం ను అడ్డుకున్న పోలీసులు
మండల పరిధిలోనీ సోమశిల కృష్ణా నది తీరంలో దళితుల భూముల్లో హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తున్నందుకు అక్కడి పరిస్థితిని కనుగొనేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్ష వర్షన్ రెడ్డి ని గ్రామానికి మూడు కిలో మీటర్ల దూరం లోనే పోలీసులు అడ్డుకున్నారు.

దిశ, కొల్లాపూర్/పెంట్లవెల్లి : మండల పరిధిలోనీ సోమశిల కృష్ణా నది తీరంలో దళితుల భూముల్లో హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తున్నందుకు అక్కడి పరిస్థితిని కనుగొనేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్ష వర్షన్ రెడ్డి ని గ్రామానికి మూడు కిలో మీటర్ల దూరం లోనే పోలీసులు అడ్డుకున్నారు. ఉదయం నుంచి ముందస్తుగా సోమశిల దారిలో మల్లేశ్వరం క్రాస్ రోడ్డు వద్ద తిష్ట వేసి కొత్త వారిని పోలీసులు గ్రామానికి వెళ్లనీయలేదు. సోమశిల గ్రామస్థులైతే వారిని క్షుణ్ణంగా పరిశీలించి పంపుతున్నారు. ఉదయమే సోమశీల హెలిప్యాడ్ భూ బాధిత రైతులను ముందస్తుగా పెంట్లవెల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈనేపథ్యం లో మాజీ ఎమ్మెల్యే బీరం హర్ష వర్షన్ రెడ్డి సోమశీలకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఇరుపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది.ముందస్తుగా దళిత రైతులకు నోటీసులు ఇవ్వకుండా ఏలా భూములు హెలిప్యాడ్ కు లాక్కుంటారని మాజీ ఎమ్మెల్యే బీరం హర్ష వర్షన్ రెడ్డి పోలీసుల అధికారుల తో వాదించారు. ప్రభుత్వం దౌర్జన్యంగా అక్రమంగా దళిత రైతుల నోట్లో మట్టిగొట్టే చర్యలకు పాల్పడితే ప్రజలు తగిన బుద్ది చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి పెంట్లవెల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులు అదుపులో ఉన్న దళిత రైతులను పరామర్శించారు. ఈయన వెంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, పెంట్లవెల్లి మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు పోతుల వెంకటేశ్వర్లు, సర్పంచ్ చిట్టెమ్మ సురేందర్ గౌడ్, మాజీ సర్పంచ్ రాజేష్ , శంకర్ నాయక్ పాల్గొన్నారు.






