- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చోరీల నేరస్తుడి కోసం పోలీసుల పాట్లు..!
దిశ, మక్తల్ : పట్టణంలో గత కొద్ది రోజులుగా జరిగిన దొంగతనాల కేసులను ఛేదించడానికి పోలీసులు పాట్లు పడుతున్నారు. నిందితుడి ఊహా చిత్రాన్ని రూపొందించి పోలీసులు విడుదల చేస్తే

దిశ, మక్తల్ : పట్టణంలో గత కొద్ది రోజులుగా జరిగిన దొంగతనాల కేసులను ఛేదించడానికి పోలీసులు పాట్లు పడుతున్నారు. నిందితుడి ఊహా చిత్రాన్ని రూపొందించి పోలీసులు విడుదల చేస్తే పోలీసులకు ఆరా తీసేందుకు చాలా సులువు అవుతుందని పట్టణ ప్రజలు చర్చించుకోవడం గమనార్హం. శుక్రవారం బంగారు దుకాణాన్ని చోరీకి ప్రయత్నించి విఫలమైన సందర్భంగా సీసీ పుటేజ్ లో నమోదైన చిత్రాన్ని సంబంధించిన వ్యక్తిని పోలీసులు స్టేషన్ కి తీసుకొచ్చి ఎంక్వయిరీ చేశారు. అయితే అతను కాదని నిర్దారించుకొని వదిలిపెట్టినట్టు సమాచారం. పట్టణంలో పలు చోరీల సందర్భంగా చోరుడు పలు సీసీ పుటేజీల్లో చిత్రం నమోదై ఉంటుందని.. దాని ఊహా చిత్రాన్ని తయారు చేసి ప్రజల్లోకి విడుదల చేస్తే ప్రజలు పోలీసులు పట్టుకోవాల్సిన చిత్రంలోని వ్యక్తి ఫలానా అని పోలీసులకు సమాచారం ఇచ్చే వాళ్లు పలువురు ఉంటారనే విషయాన్ని పోలీసులు గమనించలేకపోతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున చోరీకి యత్నం చేయగా.. చోరీ జరిగే సమయంలో ఆ వ్యక్తి చెప్పిన కారణాలను నిర్దారించుకొని వదిలేసినట్టు సమాచారం. ముఖ్యంగా పలు దొంగతనాలకు పాల్పడుతున్న దొంగ మాత్రం పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతూ పోలీసులకు సవాల్ గా మారాడు. దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.






