- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ వర్షాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ జానకీ
గురువారం అర్థరాత్రి నుండి నిరంతరంగా కురుస్తున్న వర్షాలకు జిల్లా వ్యాప్తంగా వాగులు, చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయని జిల్లాలోని పోలీస్ యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ జానకి ఆదేశించారు.

భారీ వర్షాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
జిల్లా ఎస్పీ జానకి
దిశ,మహబూబ్ నగర్ ప్రతినిధి: గురువారం అర్థరాత్రి నుండి నిరంతరంగా కురుస్తున్న వర్షాలకు జిల్లా వ్యాప్తంగా వాగులు, చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయని జిల్లాలోని పోలీస్ యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ జానకి ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కొత్త చెరువు పరివాహక ప్రాంతాల నీటి ఉదృతిని సమీక్షించి సంబంధింత అధికారులకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆమె సూచనలు జారీ చేశారు. శుక్రవారం రాత్రి నుండి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. అనంతం జిల్లా స్థాయి అధికారులతో ఎస్పీ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి రాబోయే మూడు రోజులు అతి భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ స్పందనతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా రెస్క్యూ, రిలీఫ్ చర్యల్లో పోలీస్ అధికారులు, మున్సిపల్, రెవెన్యూ, ఇతర శాఖల సమన్వయం అత్యంత కీలక అవసరమని ఆమె అన్నారు. ఎస్పీ వెంట మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, డిఎస్పీ వెంకటేశ్వర్లు, వన్ టౌన్ సీఐ అప్పయ్య, ఇతర సిబ్బంది ఉన్నారు.






