- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాధితులకు వేగవంతమైన సేవలకే పోలీస్ ప్రజావాణి
by Ratna Kumari |
బాధితులకు వేగవంతమైన సేవలు అందించేందుకు పోలీస్ ప్రజావాణి నిర్వహిస్తున్నామని, అధికారులు స్పందనాత్మకంగా పని చేయాలని ఎస్పీ జానకి సూచించారు.

X
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : బాధితులకు వేగవంతమైన సేవలు అందించేందుకు పోలీస్ ప్రజావాణి నిర్వహిస్తున్నామని, అధికారులు స్పందనాత్మకంగా పని చేయాలని ఎస్పీ జానకి సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 26 మంది బాధితుల నుంచి ఆమె స్వయంగా ఫిర్యాదులను స్వీకరించారు. బాధితుల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను పరిశీలించి, వారి సమస్యలను సావధానంగా విని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి వెంటనే న్యాయం జరిగేలా చూడాలని ఆమె ఆదేశించారు. ప్రజలు పోలీస్ శాఖ పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది బాధ్యత అని ఆమె అన్నారు. ప్రజావాణి కి వచ్చే ప్రతి దరఖాస్తును పారదర్శకంగా, చట్ట పరమైన చర్యల ద్వారా పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నామని ఎస్పీ జానకి పేర్కొన్నారు.
Next Story






