మాజీ సర్పంచ్ మృతిపై పలు అనుమానాలు.. గ్రామంలో భారీగా పోలీస్ బందోబస్తు

by Bhoopathi Nagaiah |

జోగులాంబ గద్వాల జిల్లా, కేటీ దొడ్డి మండలం పరిధిలోని నందిన్నె గ్రామంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

మాజీ సర్పంచ్ మృతిపై పలు అనుమానాలు.. గ్రామంలో భారీగా పోలీస్ బందోబస్తు
X

దిశ, గద్వాల క్రైం/ కేటీ దొడ్డి : జోగులాంబ గద్వాల జిల్లా, కేటీ దొడ్డి మండలం పరిధిలోని నందిన్నె గ్రామంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. శుక్రవారం జాంపల్లి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చిన్న భీమారాయుడు మృతి చెందిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. మాజీ సర్పంచ్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, గ్రామంలో శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు పోలీసు బలగాలను మోహరించినట్లు గ్రామస్తులు తెలిపారు. చిన్న భీమారాయుడు మరణంపై నెలకొన్న సందిగ్ధత, అనుమానాల దృష్ట్యా, పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. గ్రామంలో గట్టి నిఘా ఉంచి, అనుమానాస్పద కార్యకలాపాలను అరికట్టేందుకు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు సమాచారం.

Next Story