- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమాజ హితం కోరేది కవులు : విరివింటి వెంకటేశ్వర శర్మ
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : కవులు సమాజ హితాన్ని కోరి కవిత్వం రాస్తారని, సమాజ మార్పులో కవులే కర్తలని జాతీయ

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : కవులు సమాజ హితాన్ని కోరి కవిత్వం రాస్తారని, సమాజ మార్పులో కవులే కర్తలని జాతీయ సాహిత్య పరిషత్ జిల్లా అధ్యక్షుడు విరివింటి వెంకటేశ్వర శర్మ అన్నారు. గురువారం రాత్రి స్థానిక జిల్లా గ్రంథాలయంలో జిల్లా కవి, రాచాలపల్లి బాబు దేవీ దాస్ రావు రచించిన 'రామచంద్ర ప్రభో', 'చిత్రాంగ-సారంగధరుడు' పద్య కృతుల పుస్తకాలను ఆయన, ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆచార్య కసిరెడ్డి వెంకట్ రెడ్డి తో కలిసి ఆవిష్కరించారు. కసిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ 'రామచంద్ర ప్రభో' పుస్తకంలో ప్రాచీన కవుల పద గుంబనం,లలిత పదజాలం చదువరులను ఆకట్టుకుంటుందన్నారు. ప్రొద్దుటూరు ఎల్లారెడ్డి మాట్లాడుతూ మకుటం కలిగిన 131 పద్య కావ్యాన్ని అక్కడక్కడ పద్యాలను ధారాళంగా, రమణీయంగా చదువుతూ రామ కథను ఆసాంతం పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది మనోహర్ రెడ్డి, డా.తంగెళ్ళపల్లి శ్రీదేవి, చుక్కాయపల్లి శ్రీదేవి, డా.బాలస్వామి, రావూరి వనజ, సమన్వయ కర్త శాంతా రెడ్డి, జగపతి రావు పాల్గొన్నారు.






