ఉడిమిళ్ల గ్రామంలో మా భూమి మాకు ఇప్పించండి

by Nallavelli.Anjaneyulu |

పదరా మండలం ఉడిమిళ్ల‌ గ్రామంలో అక్రమంగా స్వాధీనం చేసుకొని సాగు చేసుకుంటున్న వారి నుంచి మా భూములు మాకు ఇప్పించాలని ఐటీడీఏ మేనేజర్ జాఫర్ కు ఉడిమిళ్ళ గ్రామానికి చెందిన బాదిత చెంచు కుటుంబం విజ్ఞప్తి చేశారు.

ఉడిమిళ్ల గ్రామంలో మా భూమి మాకు ఇప్పించండి
X

దిశ‌, అచ్చంపేట : పదరా మండలం ఉడిమిళ్ల‌ గ్రామంలో అక్రమంగా స్వాధీనం చేసుకొని సాగు చేసుకుంటున్న వారి నుంచి మా భూములు మాకు ఇప్పించాలని ఐటీడీఏ మేనేజర్ జాఫర్ కు ఉడిమిళ్ళ గ్రామానికి చెందిన బాదిత చెంచు కుటుంబం విజ్ఞప్తి చేశారు. బుధవారం అమ్రాబాద్ మండలంలోని మన్ననూరు ఐటీడీఏ కార్యాలయానికి ఉడిమిళ్ల‌ గ్రామానికి చెందిన చెంచులు మండ్లి పాపమ్మ కుటుంబ సమేతంగా జరిగిన అన్యాయంపై రాతపూర్వకంగా మేనేజర్ జాఫర్ కు ఫిర్యాదు చేశారు. తమ సొంత భూమినీ దౌర్జన్యంగా స్వాధీనం చేసుకొని సాగు చేసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఉడిమిళ్ల‌ గ్రామంలో ఉన్న తమ సొంత భూమి సర్వే నెంబర్ 104/1, 104/2 ల లో ఉన్న ఐదు ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన చిన్నమ్మాయి అనే మహిళ దౌర్జన్యంగా లాక్కొని సాగు చేసుకుంటున్నారని ఫిర్యాదులొ పేర్కొన్నారు. అక్రమంగా తమ భూమిని స్వాధీనం చేసుకొని దౌర్జన్యంగా సాగు చేసుకుంటున్న వారి నుండి తమ భూమిని తిరిగి ఇప్పించాలని వారు కోరారు. తక్షణమే స్పందించిన మేనేజర్ జాఫర్ పదర త‌హ‌శీల్దార్ కి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఈ భూమి వంశపారంపర్యంగా బయన్న కుటుంబానికి చెందినదేనని త‌హ‌శీల్దార్ వివరణ ఇచ్చి దీనిపై తదుపరి చర్యలకు ఆర్డిఓకు తెలియ‌జేయ‌నున్న‌న‌ట్టు తెలిపారు.

Next Story