- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
10వ వార్డులో డ్రైనేజ్ పై వేసిన కల్వర్ట్ పై గొయ్యి
by Ratna Kumari |
మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎమ్మార్వో కార్యాలయం, పోలీస్ స్టేషన్, రేషన్ షాపు వద్దకు వెళ్లే దారిలో ఓ కల్వర్టు ఉంది.

X
దిశ, నర్వ : మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎమ్మార్వో కార్యాలయం, పోలీస్ స్టేషన్, రేషన్ షాపు వద్దకు వెళ్లే దారిలో ఓ కల్వర్టు ఉంది. ఇది నాణ్యతగా లేకపోవడంతో పెద్ద గొయ్యి ఏర్పడింది. గ్రామంలోని కురువ గేరి లోని 10వ వార్డులో డ్రైనేజీపై ఉన్న కాంక్రీట్ కప్పు దెబ్బతిని పెద్ద రంద్రం ఏర్పడింది. దీంతో ఆ దారిలో రాకపోకలు సాగించే ప్రజలు వాహనదారులు తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే చిన్నారులు, రేషన్ షాపుకు వెళ్లే వారు ప్రమాదానికి గురవడం జరుగుతోంది. వృద్ధులు రాత్రి సమయంలో వెళ్లే వారికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. ప్రజలు ప్రమాదానికి గురి కాక ముందే సమస్యను పరిష్కరించి డ్రైనేజీ కప్పును మరమ్మతు చేయాలని గ్రామ ప్రజలు సంబంధిత అధికారులను కోరుతున్నారు.
Next Story






