MLA Yennam Srinivas Reddy : నిర్ధిష్టమైన లక్ష్యాన్ని ఎంచుకొని ఉన్నతంగా ఎదగండి..

by Batti.Sumithra |

నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఎంచుకొని ఉన్నతంగా ఎదుగుతూ జీవితంలో స్థిరపడాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

MLA Yennam Srinivas Reddy : నిర్ధిష్టమైన లక్ష్యాన్ని ఎంచుకొని ఉన్నతంగా ఎదగండి..
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఎంచుకొని ఉన్నతంగా ఎదుగుతూ జీవితంలో స్థిరపడాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలోని ప్రొఫెసర్ జయశంకర్ సమావేశ మందిరంలో జరిగిన 'అప్రెంటీస్ మేళా-2024' కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని, ఒకేషనల్ కోర్సులు పూర్తిచేసి, ఉద్యోగార్థమై శిక్షణ నిమిత్తం వెళుతున్న విద్యార్థులకు ఎంపిక పత్రాలను అందజేసి ప్రసంగించారు.

ప్రతిభకు సరితూగే ఉద్యోగాలు ప్రైవేటు రంగంలో కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయని వాటిని అందిపుచ్చుకొని మంచి విజయాలు సాధించాలని ఆయన సూచించారు. స్కిల్ డెవలప్మెంట్ కోర్సులకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందని, ముఖ్యంగా బాలికలు తమ కాళ్ళ పై తాము నిలబడేలా ఏదో ఒక స్కిల్ లో ప్రావీణ్యం సంపాదించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణ పేట ఇంటర్మీడియట్ విద్యాధికారులు శ్రీధర్ సుమన్, రాధారాణి, సుదర్శన్ లు, గద్వాల నోడల్ అధికారి రమేష్, నండూరి శ్రీనివాస్, ప్రిన్సిపాల్ భగవంతాచారి తదితర అధ్యాపకులు, వివిధ కంపెనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Next Story